వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదా ఇవ్వాల్సిందే: రాష్ట్రపతికి కేవిపి లేఖ.. చంద్రబాబును ఏకేసి..

వాస్తవాలు మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? అని ప్రశ్నించిన కేవిపి.. తనవల్లే పోలవరానికి జాతీయా హోదా వచ్చిందన్నారు. ఈ విషయాన్ని గుండెపై చెయ్యి వేసుకొని చెప్పగలను అని కేవిపి స్పష్టం చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపి రామచంద్రరావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. దీనిపై ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. లేఖలోని అంశాలను ప్రస్తావించడంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు గురించి చెబుతూ.. విభజన బిల్లులోని ముఖ్యమైన 10అంశాలు ఇంకా నెరవేరలేదన్న సంగతి కేవిపి ఈ సందర్బంగా గుర్తు చేశారు. హోదాపై తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లును చర్చకు రాకుండా అడ్డుకున్నారని కేవిపి మండిపడ్డారు.

పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హమిలను ఇప్పటి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వచ్చే రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాల్సిందిగా ఆయన లేఖలో కోరినట్టు తెలిపారు.

ప్ర‌త్యేక హోదాతో పాటు, 2018లోపు పోల‌వ‌రం ప్రాజెక్టుని కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి చేయ‌డం, ఆర్థిక లోటును భ‌ర్తీ, విశాఖ‌కు ప్ర‌త్యేక రైల్వే జోన్ అంశాలను లేఖలో ప్రస్తావించినట్టుగా కేవిపి పేర్కొన్నారు.

 KVP Ramachandra Rao letter to Pranab Mukherjee on Special status for AP

జల్లికట్టు ప్రస్తావన:

'ఈమధ్య కాలంలో దేశంలో ఎక్కువ వినబడుతున్న పేరు జల్లికట్టు..హోదా కోసం దాన్ని స్పూర్తిగా తీసుకోవాలయ్యా మహానుభావా చంద్రబాబు అని నేను సూచిస్తే.. దానికి వక్ర భాష్యాలు చెప్తావా?' అని కేవిపి దుయ్యబట్టారు.

తమిళ సోదరులు కులాలు, వర్గాలు, మతాలకు అతీతంగా ఏకమై జల్లికట్టుపై పోరాడారాని.. తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చుకుని కేంద్రం మెడలు వంచిన తీరును ఒకసారి పరిశీలించాలని చంద్రబాబుకు సూచించారు.

ఇక చంద్రబాబు ప్రసంగాలను ఎద్దేవా చేస్తూ కేవిపి పలు వ్యాఖ్యలు చేశారు. 'అయ్యా చంద్రబాబు గారు తమరు గంటల కొద్ది ప్రవచనాలు చెబుతారు. చాగంటి కోటేశ్వరరావు లాంటి వారు సైతం మీ ప్రవచనాలకు భయపడుతున్నారు.' అని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణిచివేస్తున్నారని కేవిపి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా కేవిపి డిమాండ్ చేశారు. వాస్తవాలు మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? అని ప్రశ్నించిన కేవిపి.. తనవల్లే పోలవరానికి జాతీయా హోదా వచ్చిందన్నారు. ఈ విషయాన్ని గుండెపై చెయ్యి వేసుకొని చెప్పగలను అని కేవిపి స్పష్టం చేశారు.

English summary
Congress MP KVP Ramachandra Rao wrote a letter to President Pranab Mukherjee on Special status for AP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X