కేవీపీ చేతిలో వైఎస్ లెక్కల చిట్టా- జగన్, షర్మిల లో ఎవరివైపు..!!
జగన్ - షర్మిల వివాదం రచ్చగా మారింది. వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారం రాజీకయ రగడ గా మారుతోంది. అన్నా, చెల్లి మధ్య ఆస్తుల పంపకాల వ్యవహారాలు ఇప్పుడు ప్రతీ చోట చర్చగా మారుతున్నాయి. జగన్ ట్రిబ్యునల్ లో కేసు...చెల్లికి లేఖ .. షర్మిల సమాధానం ఇప్పుడు పొలిటికల్ డిస్కషన్స్ గా మారాయి. ఈ సమయంలో వైఎస్ ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్ర రావు ఈ ఇద్దరి ఎవరి వైపు ఉన్నారు. వైఎస్ తేల్చిన లెక్కల గుట్ట తెలిసిన వ్యక్తి కేవీపీ ఏం చెప్పబోతున్నారు.
జగన్ వర్సస్ షర్మిల
వైఎస్ వారసులు ఇద్దరూ ఇప్పుడు ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారు. వైఎస్ జీవించి ఉన్న సమయంలో తేల్చిన లెక్కలు కాకుండా.. జగన్ తన స్వార్జితంలోనూ 40 శాతం వాటా ఇచ్చేలా షర్మిల కు రాసిచ్చిన ఒప్పంద పత్రాన్ని వైసీపీ నేతలు బయట పెట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ చేసుకున్న ఈ ఒప్పందం మేరకు ప్రస్తుతం ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులు క్లియర్ అయిన తరువాత పంపకాలు చేసుకొనేలా ఒప్పందం ఉంది. అయితే, షర్మిల తాజాగా వాటాల అమ్మకంతో జగన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. షర్మిల చేసిన పనితో జగన్ బెయిల్ రద్దు అయ్యే ప్రమాదం ఉందనేది వైసీపీ నేతల వాదన.

షర్మిల రియాక్షన్ తో
షర్మిల ఈ వాదనను జోక్ గా కొట్టి పారేసారు. అయితే, అసలు జగన్ కు తెలియకుండా షేర్లు అమ్మాల్సిన అవసరం ఏంటనేది వైసీపీ నేతల ప్రశ్న. షర్మిల తాజాగా సుదీర్ఘ లేఖ రాసారు. అసలు జగన్ సొంత ఆస్తులు లేవని.. తన తండ్రి హయాంలో నెలకొల్పిన సంస్థలకు గార్డియన్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అన్నా చెల్లి ఆస్తుల పంచాయితీలో వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా చెప్పుకునే సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి ఇద్దరూ జగన్ వైపు ఉన్నారు. అదే విధంగా వైఎస్ ఆప్త మిత్రుడు కేవీపీ మాత్రం ఈ వివాదాలకు దూరంగా ఉన్నారు. వైఎస్ మరణం తరువాత జగన్ కుటుంబానికి దగ్గరగానే ఉన్నా... జగన్ సొంత పార్టీతో పూర్తిగా దూరమయ్యారు.
కేవీపీ నెక్స్ట్ స్టెప్
షర్మిల కాంగ్రెస్ లో చేరిన సమయంలో కేవీపీ తరచూ కనిపించారు. ఆ తరువాత వైఎస్సార్ జన్మదినం, వర్థంతి రోజున నిర్వహించిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇప్పుడు అన్నా - చెల్లి మధ్య వైఎస్ జీవించి ఉన్న సమయంలో ఈ ఇద్దరితో పాటుగా వీరి సంతానం కోసం ఆస్తుల విషయంలో తీసుకున్న అన్ని నిర్ణయాల పైన కేవీపీకి సమాచారం ఉందని చర్చ జరుగుతోంది. అదే విధంగా విజయమ్మ సైతం ఇప్పుడు షర్మిల కు మద్దతుగా నిలుస్తున్నారు. అన్నీ తెలిసినా కేవీపీ మౌనంగా ఉండటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ కుటుంబ సభ్యులు ఇలా ఆస్తుల కోసం రోడ్డెక్కటం పైన ఆయన ఆవేదనతో ఉన్నారని చెబుతున్నారు. మరి..ఈ వివాదంలో కేవీపీ అసలు వైఎస్ ఆలోచన ఏంటో బయటకు చెబుతారా.. సమస్య పరిష్కారం కోసం జగన్ - షర్మిల తో చర్చిస్తారా.. కేవీపీ ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications