ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఉత్కంఠ: ఏకగ్రీవం అంటూ అరుణ్ జైట్లీకి కేవీపీ లేఖ
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బుధవారం లేఖ రాశారు.
రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లను ఏకగ్రీవంగా పాస్ చేయించాలని కోరుతూ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. 2014లో బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీకి కేవీపీ లేఖ రాయడం పెద్ద చర్చనీయాంశం అయింది.
బిల్లు పెట్టే సమయంలో వివిధ పార్టీల నేతలు ఇచ్చిన హామీలతో పాటు అప్పటి పరిస్థితులు, చేసిన వ్యాఖ్యలను ఆ లేఖలో ఆయన వివరించారు. ఇందుకు సంబంధించి సుమారు రెండొందల పేజీలతో కూడిన ఓ కాపీని కేవీపీ తన లేఖకు జత చేస్తూ అరుణ్ జైట్లీకి పంపించారు.

ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడాలని, ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన జైట్లీకి విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు ఏ ఒక్క వ్యక్తికో సంబంధించినది కాదని, ఎలాగైనా బిల్లు ఆమోదం పొందేలా చూడాలని ఆయన కోరారు.
ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే సమయమని ఆయన చెప్పారు. ఈ బిల్లును పాస్ చేసుకునేందుకు ఐపికి చెందిన ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కేంద్రంతో పోరాడాలని ఆయన సూచించారు. తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు అందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఈ నెల 22న చర్చకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదను పెట్టింది.
రాజ్యసభలో బిల్లును ఎలాగైనా పాస్ చేయించుకోవాలని ఉద్దేశంతో వివిధ పార్టీలకు చెందిన నేతలను ఢిల్లీలో కలుస్తున్నారు. మరోవైపు కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు, ఎంపీ కంభపాటి హరిబాబు రాజ్యసభకు రానివ్వమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి కేవీపీ లేఖ రాయడం పెద్ద చర్చనీయాంశమైంది.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications