తణుకులో అఘోరీ హల్ చల్-మహిళలతో అసభ్య ఛాటింగ్ చేసిన వ్యక్తిని..!
తెలుగు రాష్ట్రాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ హంగామా చేస్తున్న లేడీ అఘోరీ ఇవాళ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో హల్ చల్ చేసింది. రాజేష్ నాథ్ అనే వ్యక్తి మహిళలతో అసభ్య ఛాటింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలు చేస్తూ ఆయన ఇంటి ముందు నిరసనకు దిగింది. అక్కడితో ఆగకుండా అతన్ని అరెస్ట్ చేయాల్సిందేనంటూ అక్కడికి చేరుకున్న పోలీసులపై ఒత్తిడి చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రాజేష్ నాథ్ అనే వ్యక్తి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని అఘోరీ ఆరోపించింది. ఈ క్రమంలో అతనిపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ మేరకు మహిళలు తనకు ఫిర్యాదు చేశారని తెలిపింది. అఘోరి మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసిన చాట్ తన దగ్గర ఉందని వెల్లడించిన అఘోరీ..పలువురు మహిళలు సైతం సెల్ఫీ వీడియోలు తీసి తనకు పంపించాలని కోరింది. దీంతో అఘోరీని నియంత్రించడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది.

వెలుగులోకి అఘోర బాబా రాసలీలలు..!#Aghora #AghoraBaba #Baba #RajeshNath #ViralVideo #OITelugu pic.twitter.com/sKgU0sjJAI
— oneindiatelugu (@oneindiatelugu) March 3, 2025
రాజేష్ నాథ్ పై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని, లేదా అతన్ని చంపుతానని లేదా తాను అయినా చస్తానంటూ అఘోరీ రెచ్చిపోయింది. అనంతరం తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా అతనిపై ఫిర్యాదు చేసింది. అనంతరం అఘోరి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులు, మహిళా అఘోరి నాగసాధుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపేశారు. అఘోరీ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications