చైన్ స్నాచర్‌కు షాక్: బైక్‌పై నుంచి పడేసి పట్టుకుంది

గుంటూరు : మెడలోని గొలుసును లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించిన ఓ దొంగకు మహిళ చుక్కలు చూపించి, పోలీసులకు అప్పగించింది. తన మెడలోని గొలుసును లాగిన దొంగను ఆగ్రహంతో ఓ మహిళ వెంటాడింది. ఆమె ఉడుము పట్టు నుంచి తప్పించుకోలేక ఆ దొంగ దొరికుపోయాడు.

ఒంటరినని ఆమె వెనకడుగు వేయలేదు. 100 మీటర్ల దూరం వరకూ తనను ఈడ్చుకువెళ్ళినప్పుడు తగిలిన గాయాలను ఆమె పట్టించుకోలేదు. దొంగను పట్టించి, స్థానికులతో దేహశుద్ధి చేయించింది.ఈ ఘటన గుంటూరు జిల్లాలోని పొన్నూరులో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం - భావనగర్‌ కాలనీకి చెందిన బండ్లమూడి సుజాత మునిపల్లె గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

 Lady fights with chain snatcher in guntur district

భావనగర్‌ కాలనీలోని సాయి మందిరానికి వె ళుతుండగా గుంటూరు కు చెందిన పాత నేరస్థుడు ఎస్‌కే బాజీ తన బైక్‌పై వెంబడించి నిర్మానుష్య ప్రదేశంలో ఆమె మెడలోని గొలుసును తెంచబోయాడు. తొలుత భయపడినా ధైర్యం తెచ్చుకుని ఆమె దొంగకు ఎదురు తిరిగింది. బైక్‌పై పారిపోతున్న దొంగతో పెనుగులాడింది. సుమారు 100 మీటర్ల దూరం మేర సుజాతను ఈడ్చుకు వెళ్ళాడు. అయి నా ఆమె పట్టు వదలలేదు.

దొంగ ను బైక్‌పై నుంచి పడవేసి కేకలు వేసింది. ఆమె కేకలు విన్న అగ్నిమాపక శాఖ సిబ్బంది, స్థానికులు నేర స్థలానికి వచ్చి దొంగను బంధించారు. దేహశుద్ధి చేశారు. అర్బన్‌ పో లీసులకు సమాచారం అందించి చైన్‌ స్నాచర్‌ బాజీని అప్పగించారు. ధైర్య సాహసాలతో దొంగను ఎదిరించి పట్టుకున్న ఉద్యోగి సుజాతనుపోలీసులు అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+