లేడీ టీచర్ ఆత్మహత్య: పెళ్లి కాలేదని చెప్పి, గదిలో ఉంచాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: ఓ వ్యక్తి వలపు వల విసిరి మోసం చేయడంతో ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురానికి ెందిన విజయలక్ష్మి అనే ఓ ఉపాధ్యాయురాలు అతని మోసానికి బలి అయింది.

విజయలక్ష్మి ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలు. ఆమె ఎలుకల మందు తిని, ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఈ నెల 23వ తేదీన జరగింది. ఆస్వస్థకు గురైన ఆమె తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. తాను రాసిన సూసైడ్‌ నోట్‌లో సూర్యమోహన్ తనను ఎలా మోసం చేసిందీ ఆమె వివరించారు.

 కమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడు అలా...

కమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడు అలా...

పులివెందుల మున్సిపాలిటీ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి సూర్యమోహన్ తనను మోసం చేశాడని, తన మరణానికి ఆయనే కారణమని విజయలక్ష్మి (23)తన సూసైడ్‌ నోట్‌లో ఆరోపించింది. ఆ లేఖ ఆధారంగా అనుమానాస్పద మృతిగా పులివెందుల పోలీసులు నమోదుచేశారు.

ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో టీచర్‌గా...

ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో టీచర్‌గా...

కడపలోని ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థలో విజయలక్ష్మి ఉపాధ్యా యురాలిగా పనిచేస్తోంది. పులివెందులలో మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన సూర్యమోహన్‌ కూతుళ్లు ఆమె పనిచేస్తున్న పాఠశాలలో చదువుకునేవారు. తన కూతుళ్లను పాఠశాలలో దించేందుకు వచ్చివెళ్లే క్రమంలో సూర్యమోహన్‌ విజయలక్ష్మితో పరిచయం పెంచుకున్నాడు.

 తనకు పెళ్లి కాలేదంటూ..

తనకు పెళ్లి కాలేదంటూ..

తనకు వివాహం కాలేదని, నువ్వు అంగీకరిస్తే పెద్దలతో మాట్లాడి వివాహం చేసుకొంటానని సూర్యమోహన్ ఆమెను నమ్మించాడు. అతనితో స్నేహాన్ని, పెళ్లి ప్రస్తావన వదిలేయాలని కుటుంబ సభ్యులు విజయలక్ష్మిపై ఒత్తిడి పెట్టారు. వారిని కాదని విజయలక్ష్మి సూర్యమోహన్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది.

 అతనికి కూతుళ్లున్నారని తెలిసి...

అతనికి కూతుళ్లున్నారని తెలిసి...

సూర్యమోహన్‌ను పెళ్లి చేసుకుని తన కుటుంబ సభ్యుల ముందుకు రావాలని అనుకున్నానని, అయితే అతనికి వివాహమైన ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు తెలిసిందని, మగపిల్లవాడి కోసం తనను దగ్గరకు తీశాడని. కడపలో ఒక గదిలో తనను ఉంచాడని ఆమె చెప్పింది. ఏసీబీ కేసులో చిక్కుకుని, ఉద్యోగం పోవడంతో తను ఉన్న గదిని ఖాళీ చేయించాడని, తనను పట్టించుకోవడం మానేశాడని ఆమె సూసైడ్ నోట్‌లో రాసింది.

 చాలా సార్లు పెళ్లి చేసుకోవాలని అడిగా..

చాలా సార్లు పెళ్లి చేసుకోవాలని అడిగా..

పెళ్లి చేసుకోవాలని తాను చాలా సార్లు అడిగానని, తనకు ప్రరస్తుతం ఉద్యోగం లేదని అలాంటి ఆలోచన మానేయాలని చెప్పాడని విజయలక్ష్మి చెప్పింది. ఒకరోజు అతని కూతురు ఫోన్‌ చేసి దూర్భాష లాడిందని, సూర్యమోహన్‌ బావమరిది కూడా నీచమైన భాష మాట్లాడాడని లేఖలో రాసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A lady teacher at Pulivenduala in Kadapa district of Andhra Pradesh allegedly cheated by Surya Mohan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి