ఏపీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి జోస్యం
ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తంగా భద్రపరచడం జరిగింది. గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కంటే పోలింగ్ శాతం తగ్గింది. 2019 ఎన్నికల్లో 79.74 % పోలింగ్ జరగ్గా..ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం 68.09 జరిగినట్టు అధికారులు ప్రకటించారు. ఓటింగ్ శాతం తగ్గడంతో ఆ ప్రభావం ఏ పార్టీ మీద చూపిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాలపై ఆంధ్ర ఆక్టోపస్‌గా పిలవబడే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పందించారు.విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పోలింగ్ బూతులను సందర్శించిన మాజీ ఎంపీ లగడపాటి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...తాను 2019 నుంచి సర్వేలు చెప్పడం మానేశానని చెప్పుకొచ్చారు. గతంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల నాడీ తెలుసుకునే వాడిని.. కానీ, ఇప్పుడు రాజకీయాల్లో లేను.. అలాగే, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదన్నారు.

ఇప్పటికే సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది.. మొత్తం ప్రజలందరూ ఓట్లు వేయడానికి బస్సుల్లో, ఫ్లైట్లో, ట్రైన్లో వస్తున్నారని పేర్కొన్నారు. ఇక, జూన్ 4వ తేదీన ఎవరు గెలుస్తారో మీకే తెలుస్తుంది అని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు.మధ్యాహ్నం సమయం ఖాళీగా ఉంటుందని ఓటెయ్యడానికి వచ్చాను అని లగడపాటి రాజగోపాల్ చెప్పుకొచ్చారు. కానీ, ఏ పోలింగ్ బూత్ దగ్గర చూసిన జనాలు బారులు తీరారు.. ప్రజలందరూ ఉత్తేజంగా ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారు.. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైంది ఓటు.. అలాంటి ఓటు హక్కును ప్రజలందరూ వినియోగించుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications