రిజైన్ ఆమోదించట్లేదు: స్పీకర్‌పై హైకోర్టుకు లగడపాటి

తాను రాజీనామా చేసి 65 రోజులు గడుస్తున్నప్పటికీ దానిని స్పీకర్ ఆమోదించలేదని, దానిని ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తన అభీష్టానికి విరుద్ధంగా తనను ఎంపీగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. స్పీకర్ రాజీనామా పైన నిర్ణయం తీసుకోకపోవడంతో తాను ఇష్టం లేకున్నా పదవిలో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని పలుమార్లు స్పీకర్‌ను కోరానన్నారు.
లగడపాటిది డ్రామా: పయ్యావుల
లగడపాటి రాజగోపాల్‌ది పెద్ద డ్రామా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఈ రోజు నుండి కోర్టుకు సెలవులు అని, రాజీనామాలపై న్యాయస్థానానికి వెళ్తే లాభం లేదన్నారు.
మరో నెల రోజుల వరకు లగడపాటి పిటిషన్ విచారణకు రాదన్నారు. అందుకే పిటిషన్ వేశారన్నారు. రాజీనామాల పైన లగడపాటికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పీకర్ ఇంటి ముందు ఆందోళన చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications