తిరుగులేని లగడపాటి ఎగ్జిట్ పోల్స్: మరోసారి హిట్
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తన సర్వేలకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఎప్పుడూ ఎన్నికల ముందు తన సర్వేలను ప్రకటించే లగడపాటి రాజగోపాల్.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా తన సర్వేను వెల్లడించారు. ఈ ఎన్నికల ఫలితాలు కూడా లగడపాటి సర్వేకు అనుగుణంగానే ఉండటం గమనార్హం.
సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 270 నుంచి 280 మధ్య సీట్లు వస్తాయని లగడపాటి రాజగోపాల్ అంచనా వేశారు. లగడపాటి చెప్పినట్లుగానే బిజెపికి సొంతంగా 284 సీట్లు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్‌లో బిజెపి కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని కొన్ని ఛానళ్లు కూడా తమ అంచనాలను ప్రకటించాయి కానీ.. బిజెపి సొంతంగా మెజార్టీ స్థానాలు సాధిస్తుందని ఒక్క ‘న్యూ 24 చాణక్య' మాత్రమే పేర్కొంది.

సీమాంధ్రలో సీట్లపై ఎన్డీటీవీ, సిఎన్ఎన్-ఐబిఎన్ ఛానళ్లు తమ అంచనాలు వెలువరించాయి. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంటుందని ఐబిఎన్ ఛానల్ అంచనా వేయగా.. ఎన్డీటీవీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపింది. చివరికి ఈ రెండు ఛానళ్ల అంచనాలు తప్పని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. తెలంగాణ ఈ ఛానళ్ల సర్వేలు కొంత వరకు నిజమైనప్పటికీ.. కాంగ్రెస్ ఇంత తీవ్రంగా విఫలమవుతుందని అంచనా వేయలేకపోయాయి.
అయితే లగడపాటి రాజగోపాల్ అంచనా మాత్రం నిజమైంది. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి-బిజెపి కూటమికి 115 నుంచి 125 అసెంబ్లీ స్థానాలు, 19 నుంచి 22 వరకు పార్లమెంటు స్థానాలు వస్తాయని లగడపాటి అంచనా వేశారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి 60 సీట్లకు అటు ఇటుగా సీట్లు వస్తాయని చెప్పారు. లగడపాటి అంచనాలకు అనుగుణంగానే ఏపిలో టిడిపి-బిజెపి కూటమికి 106 అసెంబ్లీ, 17 ఎంపి స్థానాలను టిడిపి-బిజెపి కూటమి కైవసం చేసుకుంది. తెలంగాణలో 63 అసెంబ్లీ స్థానాలను, 11 ఎంపి స్థానాలను టిఆర్ఎస్ గెలుచుకుంది.












Click it and Unblock the Notifications