నోటీసుపై లగడపాటి ఆవేదన, జగన్ పార్టీ కార్యకర్త మృతి

విజయవాడ: తమకు భారీ మెజార్టీ వస్తుందని, ఇన్ని సీట్లు వస్తాయని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు ఈసి నోటీసు ఇవ్వలేదని, తనకు మాత్రమే ఇచ్చిందని లగడపాటి రాజగోపాల్ బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తన రాజకీయ భవిష్యత్తు పైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఎపిలో 70 శాతం మించి పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ శాతం పెరిగినందున సీమాంధ్రలో టిడిపికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

Lagadapati responds on his political future

జగన్ పార్టీ అభ్యర్థిపై దాడి

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వర రావుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు.

కారుమూరి మాట్లాడుతూ.. పెదవేగి మండలంలోని ఓ గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తానన్న ఇంజనీరింగ్ విద్యార్థిపై టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ వర్గీయులు దాడి చేయడంతో అతనిని పరామర్శించేందుకు వచ్చానని అన్నారు. అతనిని పోలీసులకు చూపించి తిరిగి వెళ్తుండగా చింతమనేని తనపై దాడికి దిగాడని, అడ్డుకున్న తన గన్‌మెన్‌ను గాయపరిచారన్నారు.

జగన్ పార్టీ అభ్యర్థి మృతి

తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇనుగంటివారిపేటలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరస్పర దాడిలో జగన్ పార్టీకి చెందిన కార్యకర్త మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+