• search
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హీరో శివాజీ ని టిడిపి నేతలు చంపేస్తారు:లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు;స్పందించిన శివాజీ

|

హైదరాబాద్:హీరో శివాజీని ఉద్దేశించి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీకి ప్రాణహాని ఉందని ఆమె హెచ్చరించారు. ఆపరేషన్‌ గరుడ పేరుతో శివాజీని టీడీపీ నేతలు బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఆపరేషన్‌ గరుడ వ్యవహారంలో హీరో శివాజీ మోసపోవద్దన్నారు. కుట్రలను పసిగట్టి శివాజీ జాగ్రత్తగా ఉండాలని లక్ష్మీపార్వతి సూచనలు చేశారు. శివాజీని పంపి ఆ నెపం జగన్ పై వేయాలని లక్ష్మీపార్వతి ఆరోపించారు. కొంతకాలం క్రిందట ఆపరేషన్ గరుడ కుట్ర అంటూ ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు, సినీ హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Lakshmi Parvathi sensational comments over Hero Shivaji

ప్రస్తుతం శివాజీ అమెరికాలో ఉన్నారు. ఇటీవలే ఆపరేషన్ గరుడకు సంబంధించి హీరో శివాజీని అరెస్ట్ చేయాలంటూ వైసిపి నేతలు విజయవాడ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన క్రమంలో వారి ఫిర్యాదుపై అమెరికా నుంచే హీరో శివాజీ స్పందించారు. వైసిపి నేతల వైఖరిని దుయ్యబడుతూ శివాజీ అమెరికా నుంచే ఒక వీడియో విడుదల చేశారు. ఆపరేషన్ గరుడ విషయంలో వైసీపీ నేతలు గుమ్మడికాయ దొంగల్లా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని హీరో శివాజీ ప్రశ్నించారు.

నాకున్న సమాచారం ప్రకారం నేను ఆపరేషన్ గరుడ గురించి చెప్పాను. నేను చెప్పిందే మీరు నిజం చేస్తున్నారు. మళ్లీ నన్నే తప్పుబడుతున్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని మీరే అడిగారు...ఎందుకు పెట్టాలి?...అని శివాజీ ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేయాలని వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారని...రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వాలని కోరుతున్నారని...ఎందుకు ఇవ్వాలి...నేనేమైనా బ్యాంకులని మోసగించానా?....రుణాలు ఎగ్గొట్టి అమెరికా వచ్చానా?...అని శివాజీ మండిపడ్డారు.

సిఎం చంద్రబాబు నాకు డబ్బులిస్తే నేను అమెరికా వచ్చానని వైసిపి నేతలు అంటున్నారు. నేను అమెరికా రావడం ఇదే మొదటిసారి కాదు...నా వీసా చెక్ చేసుకోండి...ఇప్పటికి 54 సార్లు అమెరికా వచ్చాను. అదీ 2010 నుంచి అనేక సందర్భాల్లో అమెరికా వచ్చా...నాకు ఛార్జీలకు డబ్బులు కూడా లేని పరిస్థితి...వేరే వాళ్లు డబ్బులు ఇస్తేనే అమెరికా వచ్చేంత హీన పరిస్థితి లేదన్నారు. అయితే హీరో శివాజీ అమెరికాకు పారిపోయారని వైసిపి,బిజెపి నేతల విమర్శల నేపథ్యంలో హీరో శివాజీ నుద్దేశించి లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో తనకు ప్రాణ హాని ఉందంటూ లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలపై హీరో శివాజీ స్పందించారు. తాను చావుకు భయపడే పిరికివాడినికాదని...తనకు చావంటే భయం లేదని అన్నారు. నిజాన్ని ప్రపంచానికి చాటేందుకు దేనికైనా సిద్ధమన్నారు. ఏపీని నాశనం చేస్తున్న ఢిల్లీ రాక్షసుల భరతం పడతానని హీరో శివాజీ హెచ్చరించారు. లక్ష్మీపార్వతి తనపై జాలీ చూపాల్సిన అవసరంలేదని...తనకు ఆమెను చూస్తేనే జాలేస్తోందన్నారు. వైసీపీ తరపున ఎన్ని వాదనలు చేసినా లక్ష్మీపార్వతికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కవని హీరో శివాజీ వ్యాఖ్యానించారు.

ఈ నేపధ్యంలో తనకు ప్రాణ హాని ఉందంటూ లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలపై హీరో శివాజీ స్పందించారు. తాను చావుకు భయపడే పిరికివాడినికాదని...తనకు చావంటే భయం లేదని అన్నారు. నిజాన్ని ప్రపంచానికి చాటేందుకు దేనికైనా సిద్ధమన్నారు. ఏపీని నాశనం చేస్తున్న ఢిల్లీ రాక్షసుల భరతం పడతానని హీరో శివాజీ హెచ్చరించారు. లక్ష్మీపార్వతి తనపై జాలీ చూపాల్సిన అవసరంలేదని...తనకు ఆమెను చూస్తేనే జాలేస్తోందన్నారు. వైసీపీ తరపున ఎన్ని వాదనలు చేసినా లక్ష్మీపార్వతికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కవని హీరో శివాజీ వ్యాఖ్యానించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్ యుద్ధ క్షేత్రం
  • Asaduddin Owaisi (AIMIM)
    అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం)
    జమీందార్ పార్టీ
  • Dr. Bhagwanth Rao
    డా. భగవంత్ రావు
    భారతీయ జనతా పార్టీ

English summary
Hyderabad: Lakshmi Parvathi made sensational comments on hero Shivaji. She warned that Shivaji had a life threat and she alleged that TDP leaders were trying to kill Shivaji in the background of Operation Garuda.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more