బంజారాహిల్స్‌లో 3.7 ఎకరాలు స్వాహాకు ప్లాన్: ఏపీ టీడీపీ నేత దీపక్‌పై కేసు
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో భూ ఆక్రమణకు యత్నించిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత దీపక్‌రెడ్డిపై హైదరాబాద్ సెంట్రల్‌క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో భూ ఆక్రమణకు యత్నించిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత దీపక్‌రెడ్డిపై హైదరాబాద్ సెంట్రల్‌క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబరు2లో 3.37ఎకరాల భూమి తమదేనంటూ తప్పుడు పత్రాలు సృష్టించారన్న అభియోగాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో దశాబ్దాల క్రితం నివాసమున్న అయూబ్ కమల్ అనే శరణార్థికి చెందిన 3.37ఎకరాల భూమిని 1960లో ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. ఈ భూమిని అయూబ్ కమలే వేరే ఇద్దరు వ్యక్తులకు విక్రయించినట్టు, అటు పై వారు తమకు అమ్మినట్టు జైహనుమాన్ ట్రేడర్స్, దీపక్‌రెడ్డిలు నకిలీ పత్రాలు సృష్టించారు.
అనంతరం తమ భూమిని కబ్జా చేశారంటూ ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్‌పై జైహనుమాన్ ట్రేడర్స్ యజమాని కుమారుడు, ప్రధాన నిందితుడు శైలేంద్ర సక్సేనా భూకబ్జా నిరోధక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఎంవీఎస్ చౌదరి తరఫు ప్రతినిధి రాధాకృష్ణమూర్తి రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన పత్రాలను కోర్టులో సమర్పించారు.

కొద్దిరోజుల కిందట ఆయన బంజారాహిల్స్ పోలీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... పోలీస్ అధికారులు ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఫిబ్రవరి 7న ఆర్థికనేరాల విభాగం శైలేంద్ర సక్సేనా తదితరులతో పాటు ఎ5గా దీపక్‌రెడ్డిపై కేసు నమోదు చేసింది.ఈ కేసులో ఏ5గా దీపక్‌రెడ్డి ఉన్నారని సీసీఎస్ అధికారులు తెలిపారు.
కాగా, ప్రాథమిక విచారణలో ప్రధాన నిందితుడు శైలేంద్ర సక్సేనా తప్పుడు పత్రాలు సమర్పించారని ఆధారాలు లభించడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. చట్టప్రకారం దీపక్‌రెడ్డిపైనా చర్యలు తీసుకుంటామని డీసీపీ(క్రైం)అవినాశ్ మహంతి స్పష్టం చేశారు.
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్












Click it and Unblock the Notifications