ఓటు వేయాలనుకుంటున్నారా - ఈసీ కీలక సూచన..!!

ఏపీలో ఎన్నికల పోరు హోరా హోరీగా మారుతోంది. తాజాగా సీఎం జగన్ పైన విజయవాడ లో రాయి దాడి కలకలం రేపుతోంది. ఇటు ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఇటు పోలింగ్ శాతం పెంచేందకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ సమయంలోనే ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారికి ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది. ఈ నెల 15వ తేదీలోగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటేనే ఈ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓటేసే అవకాశం లభిస్తుంది.

రేపే లాస్ట్ ఛాన్స్
కొత్త ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం విధించిన గడువు సమీపిస్తోంది. 18 ఏళ్లు నిండిన వారితో పాటూ అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాల వలన ఓటరుగా పేరు నమోదు చేసుకోని వారు ఇక ఆలస్యం ఎంతమాత్రం చేయకుండా తమ పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ఈ నెల 15వ తేదీలోగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుతోంది. వారికి మాత్రమే ఈ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓటేసే అవకాశం లభిస్తుంది. 2006 మార్చి 31లోగా పుట్టిన వారంతా ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. దరఖాస్తుకు వయస్సు ధ్రువపత్రంతోపాటు పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో జతపరిచి సంబంధిత బీఎల్వోలకు అందజేయాలి.

Last date for newvoter enrolment 15th Aprila list publsied on 25th of this month

నమోదు కు అవకాశం
ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారు, అన్ని అర్హతలున్నా ఇప్పటివరకూ ఓటరుగా నమోదు చేసుకోని వారంతా ఫారం-6 ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఓటరు నమోదుకు వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు అన్నీ ఓకే అయిన తరువాత కొన్ని రోజులలో ఇళ్ల వద్దకే ఓటరు గుర్తింపు కార్డును పంపిస్తారు. సంబంధిత ప్రాంత బూత్‌లెవెల్‌ అధికారులు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తారు. ఒకవేళ గుర్తింపు కార్డు రాకున్నా ఆన్‌లైన్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. ప్రజలు దరఖాస్తులు చేసుకునే సమయంలో దరఖాస్తు రిజెక్ట్‌ కాకుండా నిర్ణీత ప్రొఫోర్మాలో ఆధార పత్రాలతో జతపర్చి దరఖాస్తు చేసుకోవాలి.మే నెల 13న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ఓటర్ల జాబితా ప్రకటనకు ఈసీ సమాయత్తం అవుతోంది.

Last date for newvoter enrolment 15th Aprila list publsied on 25th of this month

25న ఓటర్ల జాబితా
ఇప్పటికే బూత్‌స్థాయి అధికారులు (బీఎల్వో)తో పాటూ తహశీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలలో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచారు. ప్రజలు ఈ జాబితాలను పరిశీలించి జాబితాలో తమపేరు ఉందో లేదో చూసుకోవాలి. మున్సిపాల్టీలలో మున్సిపల్‌ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఎన్నికల సంఘం ఓటరు సర్వీస్‌ పోర్టల్‌తో పాటు ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు చివరి గడువు మాత్రం ఏప్రిల్‌ 15. కాగా, తాజాగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వారి పేర్లను అనుబంధ జాబితాలో చేరుస్తారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయాలన్నా, అభ్యర్థులుగా పోటీ చేయాలన్నా ఓటరు జాబితాలో పేరుంటేనే సాధ్యం అవుతుంది. ఈ జాబితాను ఈ నెల 25న ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+