ఏపీలో గెలుపుపై తాజా లెక్కలు..వైసీపీ, టీడీపీకి వచ్చే సీట్లు ఇవే
ఏపీలో ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. ఈ నెల 13 ఎన్నికలు జరగ్గా.. వచ్చే నెల 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.నేతల జాతకం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తం అయ్యాయి. గెలుపుపై ఇరు వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఏపీలో దాదాపు 81 శాతం ఓటింగ్ జరిగింది. ఇక జూన్ 4న వెలువడనున్న ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా అతృతుగా ఎదురు చూస్తున్నారు.
గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. కూటమి పార్టీలు గా ఉన్న టీడీపీ, జనసేన , బీజేపీలు 115 నుంచి 140 స్థానాల వరకు దక్కించుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.ఇక కూటమి పార్టీల విషయానికొస్తే రాయలసీమలో వైసీపీకి 25 నుంచి 30 స్థానాలు వస్తాయని, మరో 20 సీట్లు తాము దక్కించుకుంటామని అంచనా వేసుకుంటున్నాయి.

కోస్తా ఆంధ్రాలో జనసేనతో పొత్తు కారణంగా టీడీపీ, బీజేపీ కలిపి ఏకపక్షంగా అనేక జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కోస్తా ఆంధ్రాలోనే తమకు మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన మెజార్టీ సీట్లు వస్తాయని కూటమి పార్టీల నేతలు అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు అధికార వైసీపీ 150 సీట్లకు పైగా సాధిస్తామని చెబుతూ ఉండగా, కనీసం 120 స్థానాల్లో అయినా పార్టీ అభ్యర్థులు గెలుస్తారని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ రాయలసీమలో 49 సీట్లు గెలుచుకుంది.
ఈసారి కనీసం 35 నుంచి 40 సీట్లు గెల్చుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు.కోస్తా ఆంధ్రాలో ప్రతి జిల్లాలోనూ నామమాత్రపు సీట్లు లభించినా, 9 ఉమ్మడి జిల్లాల్లో 40 నుంచి 50 సీట్లు దక్కించుకుంటామనే ధీమాతో ఉన్నారు ఈ లెక్కలతోనే తాము మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమా ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విధంగా ఎవరికి వారే తమ గెలుపు ఖాయమనే ధీమా తో ఉంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపైనే లెక్కలు వేసుకుంటున్నారు.మరి జూన్ 4న విడుదలయ్యే ఫలితాల్లో ఎవరి అంచనాలు నిజమవుతాయో చూడాలి.












Click it and Unblock the Notifications