ఏపీలో "టోలు" తీస్తున్నారు - ఎన్నిసార్లు వెళ్తే అన్ని సార్లు కట్టాల్సిందే..!!
వాహనదారుల ను టోల్ ఫీజు పేరుతో బాదుతున్నారు. కొత్త నిబంధనలతో టోల్ ప్లాజాలు దాటాలి అంటేనే వాహనదారులు భయపడుతున్నారు. ఇప్పటి వరకు ఒక సారి టోల్ ఫీజు చెల్లిస్తే ఒక రోజు వరకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, మారిన నిబంధనల మేరకు ఏపీలోని 65 టోల్ ప్లాజాల్లో ఇక ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే, అన్నిసార్లూ టోల్ కట్టాల్సిందే. తాజా వసూల్లతో సాధారణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
టోల్ ప్లాజాలు ప్రజలకు భారంగా మారాయి. గతంలో ఉన్న నిబంధనలను మార్చి కొత్త మార్గదర్శకా ల పేరుతో సామాన్యులను గుల్ల చేస్తున్నారు. గతంలో నిర్దేశించిన టోల్ ఫీజు చెల్లిస్తే 24 గంటల వ్యవధిలో మళ్లీ ఎన్నిసార్లు తిరిగినా టోల్ వసూళ్లు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు కొత్త వసూల్లు మొదలయ్యాయి. ఏపీలోని 65 టోల్ ప్లాజాల్లో కొత్త ధరలు అమలు అవుతున్నాయి. రోజులో ఎన్ని సార్లు వెళ్లినా అన్ని సార్లు ఫీజు చెల్లించాల్సిందే. గతంలో కసారి వెళ్తే కారుకు రూ.160 చెల్లించే వారు. తిరుగు ప్రయాణంలో రూ.80 చెల్లించేవారు. కానీ, ఇప్పుడు వెళ్లిన ప్రతీ సారి కట్టాల్సిందే.

తాజా నిబంధనల మేరకు ఒక టోల్ ప్లాజా నుంచి ఒక వైపుకు పూర్తి ఫీజు వసూలు చేస్తున్నారు. అదే రూటులో రెండో సారి వెళ్తే సగం ఫీజు వసూలు చేస్తున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య కాజా టోల్ ప్లాజా వద్ద ఈ వసూళ్లతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారి పైన రాకపోకలు సాగిస్తున్న వారికి ఈ విధానం భారంగా మారింది. ఏపీలో అన్ని జాతీయ రహదారుల్లో మొత్తంగా 69 టోల్ ప్లాజా లు ఉన్నాయి. వాటిలో నాలుగు మినహా మిగిలిన 65 టోల్ ప్లాజాల్లో ఇదే రకంగా వసూల్లు కొనసాగతున్నాయి. ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న విధంగా 2031 వరకు కొనసాగుతుందని టోల్ ప్లాజాల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.
ఏపీ మీదుగా వెళ్లే జాతీయ రహదారుల్లో నెల్లూరు-చెన్నై హైవేలో ఉన్న వెంకటాచలం, సూళ్లూరు పేట, బూదరం, విజయవాడ-హైదరాబాద్ మార్గంలోని కీసర టోల్‌ప్లాజా కలిపి మొత్తం నాలుగు చోట్ల మాత్రమే పాత నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవి కాకుండా, మిగిలిన 65 టోల్ ప్లాజాల వద్ద వసూలు చేస్తున్న కొత్త ధరలు సామాన్యులకు భారంగా మారాయి.












Click it and Unblock the Notifications