రైల్వే జోన్ పై అనూహ్య ట్విస్ట్- కూటమి సమర్థతకు పరీక్ష..!!

విశాఖ రైల్వే జోన్ పైన ఇంకా కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ శంకుస్థాపన తో జోన్ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తుందని అందరూ భావించారు. అయితే, సాంకేతిక కారణాలతో పాటుగా ఒడిశా అధికారుల నుంచి వస్తున్న అభ్యంతరాలతో పనులు ఆలస్యం అవుతున్నాయి. కొత్తవలసను కూడా రాయగడ డివిజన్‌లో చేర్చాలని డిమాండ్‌ తెర మీదకు రావటంతో.. జోనల్‌ ఆఫీస్‌ పనులు మళ్లీ ఆగాయి. దీంతీ, ఈ సమస్య ఏపీలోని కూటమి నేతలకు పరీక్షగా మారుతోంది. కేంద్ర నిర్ణయం కీలకంగా మారుతోంది.

కీలక పరిణామాలు
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రైల్వే జోన్ పనుల విషయంలో తూర్పు కోస్తా జోన్‌ అధికారుల తీరు సమస్యగా మారుతోంది. జోన్ కు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఈ ఏడాది జనవరి 8న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. రైల్వే జోన్‌ భవన నిర్మాణానికి రూ.149 కోట్లతో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్‌ అక్కడ పనులు ప్రారంభించగా వివాదాలు మొదలయ్యాయి. ఆ భూమి తమదంటూ కొందరు గిరిజనులు పనులను అడ్డుకున్నారు. కాగా, వారికి ఆ భూములపై హక్కులు లేవని అధికారులు నిర్ధారించారు.

latest-twist-leads-to-new-problem-for-visakha-railway-zone

గెజిట్ ఎక్కడ
అయితే, వాస్తవానికి రైల్వేలో ఏదైనా కొత్త జోన్‌ ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించి అధికారికంగా ఒక గెజిట్‌ విడుదల చేస్తారు. జోన్‌ పరిధి, హద్దులు, ఆపరేషన్‌ తేదీ వంటి వివరాల పైన స్పష్టత ఇస్తూ అన్ని జోన్లకు గెజిట్‌ ప్రకటించాకే పనులు ప్రారంభిస్తారు. విశాఖలోని దక్షిణ కోస్తా జోన్‌కు మాత్రం ఇప్పటివరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. 3 నెలలైనా దాని గురించి ఎవ రూ ప్రశ్నించడం లేదు. జోనల్‌ కొత్త కార్యాలయం నిర్మాణం రెండేళ్లలో పూర్తిచేయాలని నిబంధన పెట్టారు. గెజిట్‌లో 'ఆపరేషన్‌ డేట్‌' ప్రకటిస్తే దాని ప్రకారం రైల్వే అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, ఉద్దేశపూర్వకంగా గెజిట్‌ ప్రకటించకపోవటం సందేహాలకు తావు ఇస్తోంది. కాగా..
దక్షిణ కోస్తా జోన్‌ ప్రకటించిన సందర్భంలో వాల్తేరు డివిజన్‌ను విడగొట్టి కొత్తగా ఒడిశాలోని రాయగడ కేంద్రంగా మరో డివిజన్‌ ఏర్పా టు చేశారు.

కొత్త వలస కోసం
విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి అరకు వరకు రాయగడ డివిజన్‌లో చేర్చారు. అయితే, తాజాగా కొత్తవలస స్టేషన్‌ను కూడా ఈ డివిజన్‌కే ఇవ్వాలని తూర్పు కోస్తా జోన్‌ అధికారులు భువనేశ్వర్‌ నుంచి ఒత్తిడి చేస్తున్నారు. దీనికి బలమైన కారణం ఉందన్న చర్చ సాగుతోంది. ఆ పరిసరాల్లో రైల్వే వ్యాగన్‌ డిపో త్వరలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీంతో కొత్తవలస స్టేషన్‌ కూడా తమ పరిధిలో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదయ్యాకే గెజిట్‌ను విడుదల చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో... ఇప్పుడు ఏపీలోని కూటమి నేతలకు ఈ సమస్య సవాల్ గా మారుతోంది. ముందుగా నాయకులు దృష్టి పెట్టి గెజిట్ విడుదల అయ్యేలా చూడాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక, ఇప్పుడు కేంద్రం.. కూటమి నేతలు ఏ విధంగా స్పందిస్తార నేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+