Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబూ థ్యాంక్స్! సీఎం నినాదాలు కాదు.. బాలకృష్ణ అడగాలి, పవన్ చెప్పారుగా: లక్ష్మీపార్వతి

Recommended Video

    TDP Govt Speaking on EVM Tampering Reflects Their Defeat Acceptance In Election

    అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీని పాలించే అర్హత లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి బుధవారం అన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో 4 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు రైతులు సహా అందర్నీ మోసం చేశారన్నారు. సొంత అజెండా లేని చంద్రబాబు పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలన్నారు.

    సంవత్సరం ముందే చంద్రబాబు తన ఓటమిని అంగీకరించారని వ్యాఖ్యానించారు. సొంత సర్వేల్లోను టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. చంద్రబాబు, టీడీపీ ముందే తమ ఓటమిని అంగీకరించినందుకు ధన్యవాదాలు అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై చంద్రబాబు మాట్లాడటం ఇది తొలిసారి కాదని, గతంలోనుఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని చెప్పారన్నారు. అంటే 2014లో ఆయన ట్యాంపరింగ్ చేశారా అన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయరాదని ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు.

    ఎన్టీఆర్ ఫోటోతో ఓట్లు అడుక్కుంటున్నారు, పక్కన ట్రెయినింగ్ దొంగ

    ఎన్టీఆర్ ఫోటోతో ఓట్లు అడుక్కుంటున్నారు, పక్కన ట్రెయినింగ్ దొంగ

    చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు మోసం చేసి ఇప్పుడు ఆయన ఫోటోతో ఓట్లు అడుక్కుంటున్నారని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. అసలు చంద్రబాబు తన బొమ్మ పెట్టుకొని గెలవాలన్నారు. ఆయన బతుకే ఓ దొంగ అన్నారు. చంద్రబాబు దొంగలను తన సలహాదారులుగా నియమించుకుంటున్నారని చెప్పారు. ట్రెయినింగ్ తీసుకున్న దొంగను చంద్రబాబు పక్కన పెట్టుకున్నారని చెప్పారు. చంద్రబాబు మొహంలో ఓటమి భయం కనిపిస్తోందని చెప్పారు. చంద్రబాబు గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి ఒక్క దానిని కూడా నెరవేర్చలేదని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. రూ.149కే ఫైబర్ నెట్ పేరుతో మోసం చేస్తున్నారన్నారు.

    సీఎం.. సీఎం నినాదాలు కాదు, బాలకృష్ణకు బాధ్యతలు అప్పగించాలి

    సీఎం.. సీఎం నినాదాలు కాదు, బాలకృష్ణకు బాధ్యతలు అప్పగించాలి

    చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బాధ్యతలను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్షకు అప్పగించాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. అన్ని పదవులను ఎన్టీఆర్ కొడుకు అయిన బాలయ్యకు అప్పగించాలన్నారు. బాలకృష్ణ కూడా ఎమ్మెల్యేగా తృప్తిపడటం కాకుండా అభిమానుల విజ్ఞప్తి మేరకు పదవులు అడగాలన్నారు. అభిమానులు బాలయ్య ఇంటిని చుట్టుముట్టి సీఎం జిందాబాద్ అంటే సరిపోదని ఆమె అభిప్రాయపడ్డారు.

    పవన్ కళ్యాణ్ చెప్పారుగా, సొంత సర్టిఫికేట్ వద్దు

    పవన్ కళ్యాణ్ చెప్పారుగా, సొంత సర్టిఫికేట్ వద్దు

    చంద్రబాబు పట్టిసీమ మొదలు అన్ని పథకాల్లో అవినీతికి పాల్పడ్డారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఏపీ అవినీతిలో నెంబర్ వన్ అంటూ లోకమంతా దుమ్మెత్తి పోస్తోందని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ అవినీతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పారని గుర్తు చేశారు. పదేపదే నేను నీతివంతుడిని అని సొంతగా సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కాకుండా మీకు మీరే విచారణ జరిపించుకుంటే బాగుంటుందని హితవు పలికారు. లోకేష్ అవినీతి ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలన్నారు.

    ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికావ్

    ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికావ్

    ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడన్నారు. చంద్రబాబు ఎంతో అవినీతికి పాల్పడ్డాడని, కానీ పరిటాల రవి వంటి కేసులను టీడీపీ నేతలు జగన్‌కు ముడిపెట్టారని, విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. చంద్రబాబు అన్ని కేసుల్లో స్టే తెచ్చుకున్నారన్నారు. నిజాయితీపరుడివే అయితే సీబీఐ విచారణ జరిపించుకోవాలని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో చంద్రబాబు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+