19లో ‘ఫ్యాన్’ ఔట్: లోకేష్, ‘టచ్‌లో 12మంది జగన్ పార్టీ ఎమ్మెల్యేలు’

శ్రీకాకుళం: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.25వేల కోట్ల రైతు రుణమాఫీ ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యపడిందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో రూ.2.15 కోట్లతో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ శుద్ధజల ప్లాంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పలాసలో ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు.

ఫ్యాన్ కిందపడటం ఖాయం..

ఫ్యాన్ కిందపడటం ఖాయం..

భవిష్యత్తులో అన్ని స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా ఖాయమని లోకేశ్‌ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో జగన్ పార్టీ ‘ఫ్యాన్‌' రెక్కలు విరిగిపోయాయని, 2019 ఎన్నికల్లో ఏకంగా ఫ్యాను మోటారు కింద పడిపోతుందని అన్నారు.

జగన్ పార్టీ వారికి రుణమాఫీ చేశాం..

జగన్ పార్టీ వారికి రుణమాఫీ చేశాం..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు అర్హత గల ప్రతీ రైతుకు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. దీనిపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపక్ష పార్టీకి చెందిన అభ్యర్థులకు సైతం రుణమాఫీ జరిగిందన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ఐటీలో లక్ష, ఎలక్ట్రానిక్‌ విభాగంలో 2 లక్షలు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 6 వేలు ఐటి ఉద్యోగాలు కల్పించామన్నారు.

జగన్‌కు సవాల్.. తమ్ముడంటూ రామ్మోహన్‌పై..

జగన్‌కు సవాల్.. తమ్ముడంటూ రామ్మోహన్‌పై..

రుణమాఫీ ద్వారా ప్రతిపక్షపార్టీలో అనేక నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కూడా లబ్ధి పొందారని, ఒక్కొక్కరికి ఎంత మాఫీ జరిగిందో ఆధారాలతో చెబుతామని, ఆ డబ్బులు తిరిగి వెనక్కు ఇస్తారా? అని జగన్‌కు సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ... ఎంపీ రామ్మోహన్‌నాయుడును ఉద్దేశించి ‘తమ్ముడూ... శ్రీకాకుళం జిల్లాకు ఐటీ కంపెనీలను తీసుకొచ్చే బాధ్యత ఇద్దరం తీసుకుందాం' అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

ఎల్ఈడీ వెలుగులు.. అభివృద్ధి మంత్రం

ఎల్ఈడీ వెలుగులు.. అభివృద్ధి మంత్రం

2018 నాటికి అన్ని పంచాయతీల్లో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తామని, 2019 నాటికి ప్రతీ పంచాయతీలో సిమెంటు రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. దేశంలో 10 సెల్‌ఫోన్‌ తయారీ సంస్థలు ఉండగా ముఖ్యమంత్రి కృషితో రాష్ట్రంలో 2 సెల్‌ఫోన్‌ తయారీ సంస్థలు ఏర్పాటయ్యాయన్నారు. అనంతరం జలుమూరు మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో లోకేష్‌ పాల్గొన్నారు.

టచ్‌లో 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు

టచ్‌లో 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు

కాకినాడ, నంద్యాల ఎన్నికల తర్వాత 12మంది వైసీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అంతేగాక, వైసీపీని వీడి టీడీపీలో చేరుతామంటూ తనతో మంతనాలు జరుపుతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.

గతపాలకులు ఉద్దానం కిడ్నీ రోగుల సంగతే మరిచిపోయారని, సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తున్నది టీడీపీ ప్రభుత్వమేనని అచ్చెన్నాయుడు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+