జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్సైకి చంపేస్తామని బెదిరింపులు-సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు..!
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా సత్యసాయి జిల్లా పర్యటనలో రామగిరి వచ్చిన సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి రాగానే తప్పు చేసిన పోలీసుల్ని యూనిఫామ్ తీసి నిలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. వీటిపై స్పందించిన రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ అంతే దీటుగా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి.
పోలీసుల్ని బట్టలూడదీస్తానంటూ జగన్ చేసిన హెచ్చరికపై స్పందించిన రామగిరి ఎస్సై.. పోలీసుల్ని బయలూడదీయడానికి నువ్విస్తే వేసుకున్న బట్టలనుకున్నావా అంటూ రామగిరి ఎస్సై సుధాకర్ ప్రశ్నించారు. కష్టపడి చదివి, రన్నింగ్ రేసుల్లో పాసై వేసుకున్న యూనిఫాం ఇది అని, నువ్వు ఇప్పుడు దాన్ని ఊడదీస్తానంటే అదేమీ అరటి తొక్క కాదన్నారు. మేం నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే చస్తాం, అడ్డదారులు తొక్కం.. జాగ్రత్తగా మాట్లాడు అంటూ హెచ్చరించారు.

రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ pic.twitter.com/9b1K7Gi9bF
— Kudaravalli Murali Prasad (@KudaravalliMur2) April 8, 2025
ఆ తర్వాత రామగిరి ఎస్సై వ్యాఖ్యలపై వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటుగా స్పందించారు. సుధాకర్ యాదవ్ అవినీతి పరుడని, ఆయన వ్యాఖ్యలకు పోలీసు యూనిఫాం సిగ్గుపడుతోందంటూ వ్యాఖ్యానించారు. తమ కార్యకర్త ఇంటిపై రాళ్ల దాడి జరుగుతుందని ఫిర్యాదు చేస్తే నిందితుల్ని కాపాడేందుకు సుధాకర్ ప్రయత్నించాడని ఆరోపించారు. బాధితులపైనే కేసులు పెట్టిన వ్యక్తి సుధాకర్ యాదవ్ అన్నారు.
రామగిరి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తోంది అంటే...మా పార్టీ కార్యకర్త ఇంటిపై రాళ్ల దాడి జరుగుతోందని ఫిర్యాదు చేస్తే..నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు పోలీసులు. రామగిరి మండలాధ్యక్ష ఎన్నికల్లో జరిగిన గొడవల్లో బాధితులపైనే కేసులు పెట్టాడు ఎస్సై సుధాకర్ యాదవ్.
— YSR Congress Party (@YSRCParty) April 10, 2025
సుధాకర్ యాదవ్‌లాంటి… pic.twitter.com/Jh8IHLty9f
అదే సమయంలో రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకూ మంటపుట్టించాయి. దీంతో వైసీపీ సోషల్ మీడియా రామగిరి ఎస్సైపై విరుచుకుపడుతోంది. ఆయనతో పాటు కుటుంబాన్నీ చంపేస్తామని హెచ్చరికలు, బెదిరింపు కాల్స్ కూడా చేస్తోంది. దీంతో సుధాకర్ యాదవ్ కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. దీంతో తనకు, కుటుంబానికి వస్తున్న బెదిరింపు కాల్స్ పై సుధాకర్ యాదవ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుధాకర్ యాదవ్ పై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications