వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ స్పీడ్‌కు బ్రేకులు: చంద్ర‌బాబు నివాసంపై కొత్త ట్విస్ట్‌: లింగ‌మ‌నేని ఎంట్రీతో ..!

|
Google Oneindia TeluguNews

కృష్ణా క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మ‌ణ‌ల‌ను తొలిగించాల‌నే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌కు స్పీడ్‌బ్రేక‌ర్లు అడ్డు వ‌స్తున్నాయి. ప్ర‌జా వేదిక కూల్చివేత త‌రువాత అక్ర‌మ నిర్మాణాల‌కు సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందులో గోక‌రాజు గంగ‌రాజు లాంటి వారు సైతం తాము అన్ని అనుమ‌తుల‌తోనే నిర్మాణాలు చేప‌ట్టామ‌ని బ‌దులిస్తున్నారు. అక్ర‌మ నిర్మాణాల్లో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నివాసం విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏం చేయ‌బోతున్నార‌నే విష యంపై కొద్ది రోజులుగా ఆస‌క్తి క‌రంగా మారింది. అయితే, ఈ విష‌యంలో తాజాగా లింగ‌మ‌నేని ఎంట్రీ ఇచ్చారు. మ‌రి, ఇప్పుడు జ‌గ‌న్ ముందుకే వెళ్తారా..

Recommended Video

బాబు పథకాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు
సీఆర్డీఏ నోటీసుల‌కు లింగ‌మ‌నేని స్పంద‌న‌..

సీఆర్డీఏ నోటీసుల‌కు లింగ‌మ‌నేని స్పంద‌న‌..

మాజీ ముఖ్య‌మంత్రి క‌ర‌క‌ట్ట మీద లింగ‌మ‌నేని నివాసంలో 2016 నుండి ఉంటున్నారు. తాజాగా చంద్ర‌బాబు నివాసం ప‌క్క‌నే ఉన్న ప్ర‌జావేదిక‌ను ప్ర‌భుత్వం అక్ర‌మ నిర్మాణం అంటూ కూల్చివేసింది. ఇక‌, చంద్ర‌బాబు నివాసం ఉంటున్న లింగ‌మనేని గెస్ట్ హౌస్‌కు సైతం సీఆర్డీఏ నోటీసులు ఇచ్చింది. అదే స‌మ‌యంలో లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్ గురించి గ‌తంలో ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. లింగ‌మ‌నేని లాండ్ పూలింగ్ ద్వారా ఆ ఇంటిని ప్ర‌భుత్వానికి అప్ప‌గించార‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం మారిన త‌రువాత ఆ ఇంటి గురించి టీడీపీ నేత‌లు భిన్న వాద‌న చేస్తున్నారు. త‌మ అధినేత ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నార‌ని..లింగ‌మ‌నేని ఆ నిర్మాణం స‌క్రమ‌మా కాదా అనేది తేల్చుకోవాల‌ని చెబుతున్నారు.ఈ స‌మ‌యంలోనే సీఆర్డీఏ ఇచ్చిన నోటీసుల‌కు వారం రోజులు స‌మ‌యం ఇవ్వ‌గా చివ‌రి రోజున లింగ‌మ‌నేని స‌మాధానం ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఆ స‌మాధానం పైన ఇప్పుడు సీఆర్డీఏ అధికారులు ప్రభుత్వంలోని ముఖ్యుత‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు.

ఇర‌కాటంలో సీఆర్డీఏ ..ప్ర‌భుత్వానిది అయితే..

ఇర‌కాటంలో సీఆర్డీఏ ..ప్ర‌భుత్వానిది అయితే..

వైసీపీ ముఖ్య‌నేత విజ‌య సాయిరెడ్డి సైతం ఈ నిర్మాణం మీద తాజాగా స్పందించారు. లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ల్యాండ్‌పూలింగ్‌లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్టు మార్చి 6, 2016 న చంద్రబాబు ప్రకటించారని, కానీ రికార్డుల్లో మాత్రం అది ఇప్పటికీ లింగమనేని పేరునే ఉందన్నారు. తర్వాత దాని మరమత్తుల పేరిట రూ.8 కోట్లు ఖర్చుపెట్టారని..ఇంతకీ అది ఎవరిదో చంద్రబాబే చెప్పాలని విజయసాయిరెడ్డి నిలదీశారు. ప్ర‌భుత్వం పేరున ఉంటే లింగ‌మ‌నేని పేరుతో సీఆర్డీఏ నోటీసులు ఎలా ఇచ్చింద‌నే స‌మ‌స్య ఇప్పుడు మొద‌లైంది. సీఆర్డీఏ అధికారులు మాజీ సీఎం నివాసం పైన లింగ‌మేని పేరుతో నోటీసులు ఇవ్వ‌టం ద్వారా టీడీపీ వాద‌న‌ను సీఆర్డీఏ పరోక్షంగా స‌మ‌ర్ధిస్తున్న ట్లుగా క‌నిపిస్తోంది. మ‌రి..ప్రభుత్వం పేరుతో భ‌వ‌నం ఉంటే లింగ‌మ‌నేని త‌న స‌మాధానంలో కరకట్టకు దిగువన ఉన్న తమ నిర్మాణం చట్టబద్ధమేనని, అవసరమైన అనుమతులను పొందిన తర్వాతే దానిని నిర్మించామని లింగమనేని రమేష్‌ ఏపీసీఆర్డీయేకు పంపిన సమాధానంలో పేర్కొన్నట్లు తెలిసింది.

 జ‌గ‌న్ స్పీడ్‌కు బ్రేకులు ప‌డిన‌ట్టేనా..

జ‌గ‌న్ స్పీడ్‌కు బ్రేకులు ప‌డిన‌ట్టేనా..

ఇప్పుడు సీఆర్డీఏ క‌ర‌క‌ట్ట నిర్మాణాల‌కు ఇచ్చిన నోటీసులకు 11 మంది స‌మాధానం ఇచ్చారు. వారంతా తాము నాడు అనుమ‌తుల‌తోనే నిర్మాణాలు చేసామ‌ని స‌మాధానం ఇచ్చారు. అందునా వీరంతా తాము వైయ‌స్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మంయ‌లో చేసిన నిర్మాణాలుగా చెబుతున్నారు. నాడు సీఆర్డీఏ లేదు. నాటి గ్రామ పంచాయితీల అనుమ‌తి తో ఈ నిర్మాణాలు సాగాయి.ప్ర‌జా వేదిక కూల్చివేత వైసీపీ నేత‌లు స‌మ‌ర్ధించినా కొంద‌రు విశ్లేష‌కులు మాత్రం జ‌గ‌న్ తొంద‌ర ప‌డుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసారు. బీజేపీ నేత‌లు సైతం విమ‌ర్శ‌లు చేసారు. ప్ర‌భుత్వ ధ‌నంతో క‌ట్టిన భ‌వనాన్ని మరో దాని కోసం వినియోగించుకోకుండా కూల్చ‌టం స‌రికాద‌నే విమ‌ర్శించారు. ఇక‌, ఇప్పుడు కేవ‌లం ఇదే అంశం మీద ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌టం ద్వారా క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌నే అభిప్రాయం సైతం క‌నిపిస్తోంది. దీంతో..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ క‌ర‌కట్ట నిర్మాణాల విష‌యంలో త‌న స్పీడ్ త‌గ్గించాల‌ని భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

English summary
Lingamaneni Ramesh Given reply for notices which given by CRDA in last week. In his house ex CM Chandra Babu living since four years. With this answer CRDA started discussions with government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X