బ్యాంకులో మిని బార్, వైసీపీ లీడర్స్ ఎంట్రీ, గంగజాతర టైమ్ లో, ఖాతాదారులకు ?
తిరుపతిలో వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతోందని ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా తిరుపతిలో వైసీపీ నాయకులు ఇంకా పద్దతులు మార్చుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకును ఏకంగా బార్ గా మార్చేశారని, రాత్రి వరకు మందు పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు వైసీపీ మార్క్ రాజకీయాలను బ్యాంకులోనే చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన వేలాది మంది ఖాతాదారులు ఉన్నారు. సొంత అవపరాల కోసం ఇంటి యజమానులు ఇంటి పత్రాలను బ్యాంకులో పెట్టి ఒక్కొక్కరు వారికి అవసరమైన సుమారు రూ. 15 లక్షల వరకు రుణం తీసుకుని నెలనెల ఈఎంఐలు చెల్లిస్తున్నారు.

అయితే టీడీపీకి మద్దతుగా ఉంటూ రుణం తీసుకున్న ఖాతాదారులను తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ కేతం జయచంద్రా రెడ్డి, వైస్ ఛైర్మన్ వాసుదేవ్ యాదవ్ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొంత మంది ఖాతాదారులు ఇప్పటికే ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీకి మద్దతు పలికిన కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
కోఆపరేటివ్ బ్యాంకులో అర్జీలు రాసేందుకు వీలుగా ఖాతాదారుల కోసం ఓ గది ఉండేది. అయితే ఆ గదిని వైస్ ఛైర్మన్ వాసుదేవ యాదవ్ ఆయన చాంబర్ గా చేసుకున్నాడని, దానిని బార్ లాగా తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన తిరుపతి గంగ జాతర సందర్బంగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు వైస్ ఛైర్మన్ వాసుదేవ యాదవ్ చాంబర్ లో లిక్కర్ పార్టీ జరిగిందని వెలుగు చూడటంతో మీడియా మిత్రులు అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి మరుసటి రోజు వార్తలు ప్రచురించారు.
ఇంత జరిగినా కూడా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు పబ్ ను తలపించే బార్ లాగా తయారైయ్యిందని కొందరు ఖాతాదారులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారుల్లో మహిళలు ఉన్నారని, వారు బ్యాంకులోకి వచ్చి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications