కీలక నేతలపై నాన్ లోకల్ ఎఫెక్ట్ - ఫలితం మార్పు, 2014 రిపీట్..!!
ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రతీ నియోజకవర్గంలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా మారుతోంది. జగన్, చంద్రబాబు, పవన్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్ధుల పైన పై చేయి సాధించటానికి ఏ ఒక్క అవకాశం వదులుకోవటం లేదు. ఈ సమయంలోనే అనూహ్యంగా లోకల్ - నాన్ లోకల్ అంశం పలు నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది. దీంతో..ముఖ్య నేతల్లో గుబులు మొదలైంది.
స్థానికత అంశం
ఏపీలో ఈ సారి ఎన్నికల్లో మరో కీలక అంశం ప్రచార అస్త్రంగా మారుతోంది. లోకల్ - నాన్ లోకల్ అంశం ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలోనూ ఇదే అంశం పైన చర్చ సాగుతోది. ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన వంగా గీత పిఠాపురంకు లోకల్ గా... గతంలో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిన పవన్ నాన్ లోకల్ గా ప్రచారం జరుగుతోంది. వంగా గీతను పరిచయం చేసే సమయంలోనూ సీఎం జగన్ ఇదే అంశం ప్రస్తావించారు. లోకల్ హీరో కావాలా..సినిమా హీరో కావాలా ఆలోచించాలని సూచించారు. మంగళగిరిలో బీసీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాన్ లోకల్ లోకేష్ ... లోకల్ బీసీ వర్గాలకు చెందిన లావణ్య కు మధ్య పోటీ జరుగుతుందని చెప్పుకొచ్చారు.

ముఖ్య నేతలపై ప్రభావం
బీజేపీ నుంచి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కడప జిల్లా వాసి. మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్న బూడి ముత్యాల నాయుడు వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్దిగా ఉన్నారు. అక్కడ లోకల్ - నాల్ లోకల్ అంశం ప్రచారంలో ఉంది. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్ది పుత్తా మహేష్ యాదవ్ పోటీలో ఉన్నారు. మహేష్ కూడా కడప జిల్లాకు చెందిన వారే. నర్సరావు పేట నంచి పోటీ చేస్తన్న వైసీపీ ఎంపీ అభ్యర్ది అనిల్ కుమార్ యాదవ్ సైతం నాన్ లోకల్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ నర్సరావు పేట నుంచి పోటీలో ఉన్నారు. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి చిత్తూరు జిల్లా వాసి. ఇదే తరహాలో మరి కొందరు ఎమ్మెల్యే అభ్యర్దులు ఉన్నారు.

ఫలితం మార్చేస్తుందా
లోకల్ - నాన్ లోకల్ ప్రచారం సాగుతున్న వేళ 2014 ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న అంశాలను పలువురు గుర్తు చేస్తున్నారు. నాడు విశాఖ ఎంపీగా జగన్ తల్లి విజయమ్మ పోటీ చేసారు. ఆ సమయంలో టీడీపీ కూటమి లోకల్ అంశాన్ని ప్రధానంగా తమ ప్రచార అస్త్రంగా మలచుకుంది. కడప జిల్లా వారు విశాఖలో గెలిస్తే ఇబ్బందులు వస్తాయని ప్రచారం చేసారు. ఫలితంగా విజయమ్మ ఓడిపోయారు. దీంతో, ఇప్పుడు కడప జిల్లాకు చెందిన వారే కూటమి నుంచి అనకాపల్లి, ఏలూరు నుంచి ఎంపీ అభ్యర్దులుగా పోటీ చేస్తున్నారు. స్థానికత అంశం కీలకంగా మారుతోంది. దీంతో..కూటమి, వైసీపీ నుంచి సొంత జిల్లాలు కాకుండా ఇతర జిల్లాల్లో పోటీ చేస్తున్న వారి పైన ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications