వారసులం మేమైతే....తవ్వడానికి మీరెవరు?...చెన్నంపల్లికోటలో కొత్త ట్విస్ట్
కర్నూలు జిల్లా: చెన్నంపల్లికోట తవ్వకాలలో ఎవరూ ఊహించని సరి కొత్త ట్విస్ట్ ఇది. ఈ కోటలో గుప్త నిధులు ఉన్నాయంటూ రహస్య తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఇక్కడ తవ్వకాలు జరిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ రోజు జరిగిన ఒక ఘటన ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.
Recommended Video

చెన్నంపల్లికోట వారసులమంటూ త్రివిక్రమరాజు అనే వ్యక్తి ఈరోజు అధికారులను కలిశారు. ఈ కోటకు తాము వారసులమని, తమ అనుమతి లేకుండా ఇక్కడ తవ్వకాలు జరపడం చెయ్యరాదని అధికారులకు తెలిపాడు. కోట వంశవృక్షం మ్యాప్‌ను కూడా ఆయన అధికారులకు చూపించారు. త్రివిక్రమరాజు కర్నూలు జిల్లా అవుకు వాసి. అధికారులు వెంటనే తవ్వకాలు ఆపకపోతే తాను కోర్టును ఆశ్రయిస్తామని త్రివిక్రమరాజు హెచ్చరిస్తున్నారు.

చెన్నంపల్లి కోటలో విలువైన ఖనిజ నిక్షేపాలు, నిధి అన్వేషణ కోసం అధికారుల సమక్షంలో 12 రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు తవ్వకాల్లో నిధి నిక్షేపాల సంగతేమో కానీ గుర్రాలు,ఇతర జంతువుల ఎముకలు, ఏనుగు దంతాలు, ఇటుకలు వెలుగు చూశాయని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా మాత్రం నిధి దొరికిందని, అలాంటివి చాలా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటుకలు, ఎముకలు, ఏనుగు దంతాలు ఆర్కియాలజీ (పురావస్తు) శాఖ పరిధిలోకి వస్తాయని, ఆ శాఖ అధికారుల పర్యవేక్షణలోనే తవ్వకాలు సాగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ తవ్వకాల్లో నిధి నిక్షేపాలు వెలుగు చూస్తే వాటిని పటిష్ఠమైన రక్షణ మధ్య భద్రపరిచి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కలెక్టర్ ఇప్పటికే వివరణ ఇవ్వడం గమనార్హం.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications