విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్థానికులు గరం: విప్రో ఎదుట ధర్నా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విప్రోలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్వంలో విప్రో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళనకారులు ఆందోళనకు దిగారు.

2006లో అప్పటి ప్రభుత్వం ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని ఫోరం అధ్యక్షుడు లగుడు గోవిందరావు అన్నారు. రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదని ఆయన విమర్శించారు.

కేవలం 650 మంది మాత్రమే విప్రోలో పనిచేస్తున్నారని, ఇందులో 350 మంది ట్రైనీలని ఆయన అన్నారు. విప్రో ప్రతినిధులు ఉత్తరాంధ్ర అభివృద్ధి పోరం సభ్యులతో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు.

ధర్నాతో విప్రో ప్రతినిధులు..

ధర్నాతో విప్రో ప్రతినిధులు..

ఈ నెల 18, 19 తేదీల్లో ఎయు కేంద్రంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, ఇందులో స్థానికులకు అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తామని విప్రో ప్రతినిధులు ఉత్తరాంధ్ర అభివృద్ధి పోరం సభ్యులకు హామీ ఇచ్చారు.

విభజన నేపథ్యంలో..

విభజన నేపథ్యంలో..

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐటి హబ్‌గా మారుతున్న విశాఖలో స్థానికులకు అవకాశాలు కల్పించాలనేది తమ డిమాండ్ అని యుడిఎఫ్ నాయకులు చెప్పారు.

ధర్నాలో వీరు..

ధర్నాలో వీరు..

ధర్నా కార్యక్రమంలో ఆరేటి మహేష్, వెంకటరావు, నరేష్ కుమార్, సందేష్, సుమంత్, అవినాష్, ఏయు విద్యార్థులు పాల్గొన్నారు.

విప్రో ఎదుట ధర్నా..

విప్రో ఎదుట ధర్నా..

విప్రోలో స్థానికులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరిగింది.

English summary
Under the leadership of Uttarandhra Abhivridhi forum local people staged dharna in front of Wipro at Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X