14న తాత్కాలిక రాజధాని స్థలం గుర్తింపు: నారాయణ
విజయవాడ/ గుంటూరు: ఈనెల 14న ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికి స్థలాన్ని ఎంపిక చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గురువారం రాజధాని ప్రాంతంలో ఏర్పాటుచేసిన భూ సమీకరణ సభలో మంత్రి పాల్గొన్నారు. తాత్కాలిక రాజధానిలో కార్యాలయాల నిర్మాణాల కోసం ఈనెల 16న టెండర్లను పిలుస్తామని చెప్పారు.
వచ్చే నెలలో కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, జూన్ నెలాఖరుకు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఏప్రిల్ నుంచి విజయవాడ నుంచే పాలన సాగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

మార్చి నెలాఖరులోపు పశుసంవర్ధక శాఖలోని ఖాళీలను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పల్లారావు ప్రకటించారు. గురువారం జిల్లాలోని కొత్తపేటలో పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ నెల 9, 10 తేదీలలో వ్యవసాయ అనుబంధ రంగాలపై అధ్యయం చేసేందుకు స్పీకర్ ఆధ్వర్యంలో ఒక మంత్రల బృందం మహారాష్ట్రలో పర్యటించనున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications