డౌన్ ఫాల్: ఏపీ ఎన్నికలపై లేటెస్ట్ సర్వే రిపోర్ట్.. అంచనాలు తారుమారు..?

Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. ఈ నెల 27వ తేదీన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీని తరువాత షెడ్యూల్ వెలువడేంత వరకూ రాష్ట్రవ్యాప్తంగా వంద సభలను నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది. తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రా..కదలిరా పేరుతో జనంలోకి వెళ్తోంది టీడీపీ. బహిరంగ సభలు, రోడ్ షోలతో పూర్తిస్థాయి ప్రచారానికి దిగింది.

Lok Poll predictions on Andhra: YSRCP to get mejority seats in Lok Sabha elections 2024

ఈ పరిస్థితుల మధ్య ఏపీలో జరగబోయే ఎన్నికలపై సర్వే సంస్థల నివేదికలు ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి. ఇది వరకు పోల్ స్ట్రాటజీ గ్రూప్, అనంతరం పొలిటికల్ క్రిటిక్ సంస్థలు తమ అంచనాలను బయటపెట్టాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి.

తాజాగా లోక్ పోల్ సంస్థ.. తన ఒపీనియన్ పోల్ సర్వే నివేదికను ప్రకటించింది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఈ సంస్థ నిర్వహించిన సర్వే.. దాదాపుగా నిజమైంది. వాస్తవ ఫలితాలకు అద్దం పట్టింది. బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది.

అలాంటి సంస్థ ఇప్పుడు ఏపీలో లోక్‌సభ నియోజకవర్గాలపై సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో దీన్ని చేపట్టింది. రాష్ట్రంలో తాజాగా మారుతున్న సమీకరణాలనూ పరిగణనలోకి తీసుకుని తన నివేదికను రూపొందించింది.

Lok Poll predictions on Andhra: YSRCP to get mejority seats in Lok Sabha elections 2024

ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 15 లోక్‌సభ స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది లోక్ పోల్. గతంలో ఇచ్చిన మెజారిటీని స్వల్పంగా తగ్గించింది. ఇదివరకు ఇదే సంస్థ వైఎస్ఆర్సీపీకి 17 నుంచి 18 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని తెలిపింది. ఇప్పుడా సంఖ్యను 13 నుంచి 15 వరకు కుదించింది.

అదే సమయంలో టీడీపీ- జనసేన కూటమి అభ్యర్థులు.. ఆరు నుంచి ఎనిమిది స్థానాలను గెలుచుకుంటారని అంచనా వేసింది. జనసేనతో పొత్తుకు ముందు నిర్వహించిన సర్వేలో టీడీపీకి ఏడు లోక్‌సభ స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇప్పుడా సంఖ్య ఎనిమిదికి పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా- బీజేపీ/ఎన్డీఏ, కాంగ్రెస్ పార్టీలు.. ఒక్కొక్క లోక్‌స్థానాన్ని గెలుచుకుంటాయని లోక్ పోల్ తెలిపింది. వివిధ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తోన్న పరిస్థితుల్లో ఈ సర్వే వెలువడటం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+