స్పీకర్ టేబుల్‌పైకి వైసీపీ అవిశ్వాస తీర్మానం

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా అంశంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతోన్న అన్యాయాన్ని నిరసిస్తూ లోక్‌సభలో వైయస్సాకాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు శుక్రవారం ఉదయం స్పీకర్‌ టేబుల్‌పైకి చేరాయి. శుక్రవారం ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

వైయస్సార్‌కాంగ్రెస్ అభ్యర్థన మేరకు ఇప్పటికే పలు రాజకీయ పక్షాలు తీర్మానానికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. కాగా, హోదా పోరులో కలిసొస్తామన్న టీడీపీ.. శుక్రవారం సొంతగా తీర్మానం పెడతామని ప్రకటించడం గమనార్హం.

lok sabha likely debate ysrcp no confidence motion

కాగా, ప్రత్యేక హోదాపై సానుకూలంగా స్పందించనందుకు నిరసనగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా వైయస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ స్నేహలతా శ్రీవాస్తవకు నోటీసు అందజేసిన విషయం తెలిసిందే. ఈ సభ మంత్రి మండలిపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోందని నోటీసులో పేర్కొన్నారు.

లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలోని చాప్టర్‌ 17లో గల 198(బి) నిబంధన కింద తాను ఈ తీర్మానాన్ని 2018 మార్చి 16న ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ తీర్మానాన్ని 2018 మార్చి 16 నాటి సభా కార్యకలాపాల సవరించిన జాబితాలో చేర్చాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+