జగన్ రెడ్డి భయం బయటపడింది.. దమ్ముంటే ఆ పని చెయ్: లోకేష్ సవాల్

ఏపీ శాసనమండలి సమావేశాలలో గురువారం నాడు కూడా రాష్ట్రంలో మద్యనిషేధం అమలుపై చర్చ కోసం టిడిపి సభ్యులు పట్టుపట్టడంతో రచ్చగా మారింది. టిడిపి సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. కల్తీ మద్యం వ్యవహారంపై అసెంబ్లీ తరహాలోనే మండలిలోనూ ఈ రోజు టిడిపి సభ్యులు చర్చకు పట్టుబట్టి ఆందోళన కొనసాగించారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ ముందు నిరసన చేపట్టారు.

మండలి చరిత్రలో చీకటి రోజు: టీడీపీ

మండలి చరిత్రలో చీకటి రోజు: టీడీపీ


ఈరోజు శాసనమండలిలోనూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరసనగా చిడతలు వాయిస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టగా, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డబ్బులు విసిరేశారు. గందరగోళ పరిస్థితుల మధ్య మండలి నుండి టిడిపి సభ్యులను సస్పెండ్ చేస్తూ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు అసెంబ్లీ ఎదుట నిరసన తెలియజేశారు. శాసనమండలి సమావేశాల నుండి తమను సస్పెండ్ చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మండలి చరిత్రలో ఈరోజు చీకటి రోజని టిడిపి ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.

మార్షల్స్ ను అడ్డుపెట్టి గొంతు నొక్కే ప్రయత్నం

మార్షల్స్ ను అడ్డుపెట్టి గొంతు నొక్కే ప్రయత్నం


సారా మరణాలను సహజ మరణాలు అని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని దీనిపై చర్చ జరగాలని కోరాము అని టిడిపి ఎమ్మెల్సీలు తెలిపారు. సభలో మార్షల్స్ ను అడ్డుపెట్టి తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఏపీలో డీజే బ్రాండ్ మద్యం లో రసాయనాలు ఉన్నాయని తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఏపీ కల్తీ నాటుసారా మరణాలపై కూడా ఆధారాలు ఉన్నాయని తాము నిరూపిస్తామంటూ టీడీపీ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.

 అసెంబ్లీ ముందు టీడీపీ ఎమ్మెల్సీల ఆందోళన

అసెంబ్లీ ముందు టీడీపీ ఎమ్మెల్సీల ఆందోళన

వరుసగా ఎనిమిదవ రోజు కల్తీ నాటుసారా మరణాలపై, రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం అమ్మకాలపై టిడిపి నేతలు ఆందోళన కొనసాగింది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, నల్ల కండువాలు ధరించిన పార్టీ శాసనసభా పక్ష నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఇదే విషయాన్ని ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు.

దమ్ముంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి చర్చ జరపాలి: లోకేష్

దమ్ముంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి చర్చ జరపాలి: లోకేష్

కల్తీ సారా, జే బ్రాండ్ మరణాలు అన్నివైయస్ జగన్ హత్యలేనంటూ అసెంబ్లీ ఎదుట శాసనమండలి సభ్యులంతా నిరసన తెలిపామని పేర్కొన్నారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి మద్యం పై చర్చ చేపట్టడంతోనే జగన్ రెడ్డి భయం బయటపడిందని విమర్శించారు. అబద్దాలు చెబుతున్న ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ టిడిపి సభ్యులు నినదించారు. సహజ మరణాలు అంటూ ఫేక్ మాటలు మాట్లాడటం మాని దమ్ముంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి చర్చ జరపాలి అని నారా లోకేష్ సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+