వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ కు సీటు ఖ‌రారు : అక్క‌డ నుండే పోటీ : ప‌వ‌న్..అవంతి ఎఫెక్టే కార‌ణ‌మా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Elections 2019 : AP Minister Lokesh Contesting Seat Confirmed By TDP Chief Chandra Babu

ముఖ్య‌మంత్రి త‌న‌యుడు..మంత్రి లోకేష్ పోటీ చేసే స్థానం ఎట్ట‌కేల‌కు ఖ‌రారైంది. తొలుత భీమిలి నుండి లోకేష్ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అక్క‌డ స‌ర్వేలు సైతం చేయించార‌ని తెలిసింది. అక్క‌డ వైసిపి నుండి అవంతి శ్రీనివాస్ బ‌రిలో నిలుస్తున్నారు. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు చేసి..అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేస్తున్న ముఖ్య‌మంత్రి కొద్ది సేప‌టి క్రితం లోకేష్ పోటీ చేసే స్థానం పై నిర్ణ‌యం తీసుకున్నారు.

<strong>అర్ద‌రాత్రి భేటీ : చ‌ంద్ర‌బాబు తో రాధా స‌మావేశం : ల‌గ‌డ‌పాటి రాయబారం..!</strong>అర్ద‌రాత్రి భేటీ : చ‌ంద్ర‌బాబు తో రాధా స‌మావేశం : ల‌గ‌డ‌పాటి రాయబారం..!

ముఖ్య‌మంత్రి త‌న‌యుడు..మంత్రి లోకేష్ పోటీ చేసే స్థానం ఎట్ట‌కేల‌కు ఖ‌రారైంది. తొలుత భీమిలి నుండి లోకేష్ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అక్క‌డ స‌ర్వేలు సైతం చేయించార‌ని తెలిసింది. అక్క‌డ వైసిపి నుండి అవంతి శ్రీనివాస్ బ‌రిలో నిలుస్తున్నారు. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు చేసి..అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేస్తున్న ముఖ్య‌మంత్రి కొద్ది సేప‌టి క్రితం లోకేష్ పోటీ చేసే స్థానం పై నిర్ణ‌యం తీసుకున్నారు.

విశాఖ ఉత్త‌రం నుండి లోకేష్‌..

విశాఖ ఉత్త‌రం నుండి లోకేష్‌..

విశాఖ న‌గ‌రంలోని పూర్తి న‌గ‌ర ప్రాంత‌మైన విశాఖ‌-ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గం నుండి టిడిపి అభ్య‌ర్దిగా త‌న‌యుడు లోకేష్ పేరు ను ముఖ్య‌మంత్రి ఖ‌రారు చేసారు. కొద్ది రోజులుగా భీమ‌లి నుండి లోకేష్ పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాస రావు త‌న నియెజ‌క‌వ‌ర్గం నుండి లోకేష్ పోటీ చేయాల‌ని ఆహ్వానించారు. ఇదే స‌మ‌యంలో..భీమిలి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఐటి సంస్థ‌ల ఏర్పాటు దిశ‌గా అడుగులు ప‌డ‌టంతో అక్క‌డ త‌న గెలుపు సులువుగా ఉంటుంద‌ని..అదే స‌మ‌యంలో చాలాకాలం భీమిలి టిడిపికి అనుకూలంగా ఉన్న భీమిలి నియోజ‌క‌వ‌ర్గం న్ని ర‌కాల సేఫ్ సీట్ గా భావించారు. అయితే, తాజాగా మారుతున్న స‌మీక‌ర‌ణాలు..అక్క‌డ పోటీ పై తెర కొస్తున్న ఇత‌ర పార్టీల అభ్య‌ర్ధుల పేర్ల‌తో లోకేష్ సీటును విశాఖ ఉత్త‌రం నుండి పోటీ చేయించాల‌ని ఖ‌రారు చేసారు.

లోకేష్ కు ఆ స్థానం ఎందుకంటే..

లోకేష్ కు ఆ స్థానం ఎందుకంటే..

లోకేష్ కు సీటు కేటాయింపు పై అనేక కోణాల్లో అధ్య‌య‌నం చేసిన త‌రువాత‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. విశాఖ భీమిలితో పాటుగా గుంటూరు జిల్లా పెద‌కూర‌పాడు సీటు పైనా చ‌ర్చ జ‌రిగింది. అయితే, ముఖ్య‌మంత్రి గా చంద్ర బాబు రాయ‌ల‌సీమ నుండి పోటీ చేస్తుండ‌టంతో..మంత్రి లోకేష్ ఉత్త‌రాంధ్ర నుండి పోటీ చేస్తే సానుకూల సంకేతాలు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక్క‌డ క‌మ్మ వ‌ర్గంతో పాటుగా క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన వారి ఓటింగ్ శాతం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి బిజెపి అభ్య‌ర్ది విష్ణుకుమార్ రాజు పోటీ చేసి గెలుపొందారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో విశాఖ పార్ల‌మెంట్ పోరులో వైసిపి అభ్య‌ర్ధి విజ‌య‌మ్మ పై బిజెపి అభ్య‌ర్ధి హ‌రి బాబు కు 26103 ఓట్ల మెజార్టీ ద‌క్కింది. ఇక‌, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఇక్క‌డి నుండి తిరిగి పోటీ చేయ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నా.. ఏ పార్టీ నుండి చేస్తారో మాత్రం చెప్ప‌టం లేదు.

ప‌వ‌న్‌..అవంతి ఎఫెక్ట్ కార‌ణ‌మా..

ప‌వ‌న్‌..అవంతి ఎఫెక్ట్ కార‌ణ‌మా..

తొలుత భీమిలి నుండి పోటీ చేయాల‌ని లోకేష్ భావించినా..ఇప్పుడు విశాఖ ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గానికి మార‌టం వెనుక తాజాగా సిబిఐ మాజీ జేడి ల‌క్ష్మీనారాయ‌ణ టిడిపి లోకి వ‌స్తే ఆయ‌న‌ను భీమ‌లి నుండి బ‌రిలోకి దింపాల‌ని భావిస్తున్నా రు. అదే విధంగా..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ భీమిలి లేదా తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నుండి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. దీంతో..వ‌ప‌న్ పై పోటీ చేయ‌టం కంటే..సీటు మార్చుకోవ‌టం ద్వారా అన్ని ర‌కాలుగానూ ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వ్యూహాత్మ‌కంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక‌, వైసిపి నుండి అవంతి శ్రీనివాస రావు భీమిలి నుండి పోటీ చేస్తున్నారు. ఆయ‌నకు ఈ నియోజ‌క‌వ‌ర్గం లో మంచి ప‌ట్టు ఉంది. 2009 లో ప్ర‌జారాజ్యం నుండ ఇక్క‌డ గెలుపొందారు. దీంతో..గ‌ట్టి అభ్య‌ర్ధులు పోటీలో ఉండ‌టంతోనే..చివ‌రి నిమిషం లో సేఫ్ సీటుగా భావించి విశాఖ‌-తూర్పు ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

English summary
AP Minister Lokesh contesting seat confirmed by TDp Chief Chandra Babu. Lokesh mostly contest from visakha north assembly seat. Few days back party leaders says Lokesh contest from Bhimili. But, Now decision changed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X