బాలికపై గ్యాంగ్ రేప్: జగన్ పాలనలో విశాఖ అఘాయిత్యాలకు క్యాపిటల్: లోకేష్ ఫైర్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారం చేపట్టాలని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టు రాష్ట్రంలో రాజకీయం సాగుతుంది. ఇక జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిత్యం టార్గెట్ చేస్తున్నారు.

వైసీపీ పాలనలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయని నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా విశాఖలో బాలికపై 10మంది గ్యాంగ్ రేప్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బాలికను విశాఖ నుండి తీసుకెళ్ళి వేరు వేరు ప్రాంతాల్లో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో కేసును దిశకు పోలీసులకు ట్రాన్స్ ఫర్ చేశారు పోలీస్ కమిషనర్.

Lokesh fires on jagan govt over gang rape incident on visakha girl

ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనపై నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జగన్ పాలనపై నిప్పులు చెరిగిన నారా లోకేష్ పాపాల పాల‌కులు ప్ర‌శాంతమైన‌ విశాఖ పాలిట శాపంగా మారారని విమర్శించారు . రాజ‌ధాని చేస్తామ‌ని విశాఖ న‌గ‌రాన్ని నేరాలు-ఘోరాల‌కి అడ్డా చేశారని నారా లోకేష్ టార్గెట్ చేశారు.

విశాఖ‌లో బాలిక‌పై గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భ‌యాన‌క ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోందని నారా లోకేష్ పేర్కొన్నారు . సీఎం ఇంటిప‌క్క‌నే యువ‌తిపై గ్యాంగ్ రేప్ జ‌రిగితే నేటివ‌ర‌కూ నిందితుడ్ని ప‌ట్టుకోలేదని విమర్శించారు.టిడిపి పాల‌న‌లో ఆర్థిక‌రాజ‌ధానిగా విశాఖ‌ని ప్ర‌మోట్ చేశామని గుర్తు చేసిన లోకేష్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు.

Lokesh fires on jagan govt over gang rape incident on visakha girl

వైసీపీ విశాఖ‌ని అఘాయిత్యాలకి క్యాపిటల్ చేసిందని పేర్కొన్నారు . రాక్ష‌స పాల‌న‌లో ర‌క్ష‌ణ‌లేని బాలిక‌లు, మ‌హిళ‌లకు మీ కుటుంబ‌స‌భ్యుడిగా నాదో విన‌తి అంటూ పేర్కొన్న లోకేష్ మూడు నెల‌ల పాటు జాగ్ర‌త్త‌గా ఉండండి. నేర‌గాళ్ల రాజ్యం అంతం అవుతుందని స్పష్టం చేశారు. ప్ర‌జాప్ర‌భుత్వం వ‌స్తుంది, మీ ర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకుంటుందని లోకేష్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+