బాబాయ్ గుండెపోటు ఫేక్, కల్తీ సారా మరణాలు నిజం; జగన్ భయం అందుకే: లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న మరణాలపై మొదలైన వివాదం ఏపీలో ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇప్పటికే అసెంబ్లీలో టీడీపీ నేతల ఆందోళన, సస్పెన్షన్ ల నేపధ్యంలో కల్తీ సారా మరణాలపై తెలుగుదేశం పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే గ్రామస్థాయిలో రాష్ట్రంలో కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళన కొనసాగించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నేడు కూడా అసెంబ్లీ సమావేశాల నుండి టీడీపీ నేతల సస్పెన్షన్ కొనసాగింది.

శాసన మండలిలో కల్తీసారాపై వాయిదా తీర్మానం .. తిరస్కరించిన మండలి చైర్మన్
మంగళవారం నాడు శాసనమండలిలో కల్తీసారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై బ్రాండ్ మద్యం అమ్మకాలపై తెలుగుదేశం పార్టీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. టీడీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. టీటీడీతో పాటు మరికొన్ని బిల్లులను మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సభ ఆర్డర్‌లో లేకుండా బిల్లులు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ బిల్లు ప్రతులను టీడీపీ ఎమ్మెల్సీలు చించివేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

కల్తీ సారా మరణాలపై కాకుంటే దేనిపై చర్చ పెడతారు: లోకేష్
ఇదిలా ఉంటే జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. టిడిపి ఎమ్మెల్సీలను ఉపముఖ్యమంత్రి తిడుతుంటే జగన్ నవ్వుతూ చూస్తారు అంటూ ప్రశ్నించారు. సభలో కల్తీ సారా, జే బ్రాండ్ మద్యంపై చర్చ వద్దంటే ఇంకా దేనిపై చర్చలు జరుపుతారని లోకేష్ ప్రశ్నించారు. కల్తీ సారా వాస్తవాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భయపడుతోందని లోకేష్ విమర్శించారు. సభలో చర్చ జరిగితే అన్ని బయటకు వస్తాయని తమని దూషించి, సభ నుంచి జగన్ పారిపోతున్నారు అంటూ లోకేష్ మండిపడ్డారు. ఏపీ లో లభ్యమయ్యే మద్యంలో రసాయనాలు ఉన్నాయని తమవద్ద ల్యాబ్ రిపోర్టులు ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు.
Recommended Video


బాబాయ్ గుండెపోటు ఫేక్, కల్తీ సారా మరణాలు నిజం
ఇక సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసిన లోకేష్ బాబాయ్ గుండెపోటు ఫేక్, కల్తీ సారా మరణాలు నిజమంటూ నిరసన తెలిపామని పేర్కొన్నారు. సారాక్షసి, జే బ్రాండ్ల నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శాసనమండలిలో ప్రభుత్వం చర్చకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనమండలి ఛైర్మన్ కి లేఖ రాసామని వెల్లడించారు. కల్తీసారా మరణాలపై తెలుగుదేశం పార్టీ ఆధారాలు చూపిస్తుంటే వైసీపీ నేతలకు నోటమాట రావడం లేదని లోకేష్ పేర్కొన్నారు.
కల్తీ సారా, జే బ్రాండ్ లిక్కర్ కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి
సభ నుంచి టిడిపి ప్రజా ప్రతినిధులను సస్పెండ్ చేస్తూ ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు తరహాలోనే, సారా తయారీ కూడా నడుస్తోందని లోకేష్ విమర్శించారు. కల్తీ సారా, జే బ్రాండ్ లిక్కర్ కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని, సభలో దీనిపై చర్చ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని లోకేష్ వెల్లడించారు.
వైసీపీ నేతల కనుసన్నల్లోనే కల్తీ సారా తయారవుతుందని, అందుకు తమ వద్ద ఆధారాలున్నాయని లోకేష్ పేర్కొన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications