లోకేశ్,పవన్ యాత్రల్లో ఎవరిది సక్సెస్ - పట్టు చిక్కిందా, సీన్ రివర్స్..!!

ఏపీలో పొలిటికల్ టైర్స్ టైమ్స్ నడుస్తోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు యాత్రల్లో ఉన్నారు. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంతో.. జనసేనాని పవన్ వారాహి యాత్రతో ప్రజల మధ్యకు వచ్చారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే. టార్గెట్ సీఎం జగన్. రాజకీయంగా లోకేశ్ కు ఈ యాత్ర టర్నింగ్ పాయింట్. వచ్చే ఎన్నికల్లో గెలుపు పవన్ కు ప్రతిష్ఠాత్మకం. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ పవన్ తీరులో మార్పు కనిపిస్తోంది. ఇద్దరి యాత్రల్లో సక్సెస్ అవుతోంది ఎవరు. కలిసొచ్చేదెవరికి.

యాత్రలతో ఇద్దరూ ప్రజల మధ్యనే : టీడీపీ..జనసేన వచ్చే ఎన్నికల్లో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపుతో పాటుగా వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదిగేందుకు లోకేశ్ సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. 400 వందల రోజులు..నాలుగు వేల కిలో మీటర్ల యాత్ర ఇప్పటికి రాయలసమీ జిల్లాల్లో పూర్తయి..నెల్లూరులో కొనసాగుతోంది. ఈ యాత్రలో పూర్తిగా వైసీపీని లక్ష్యంగా చేసుకొని లోకేశ్ ప్రసంగాలు ఉంటున్నాయి.

 pawanlokesh

ముఖ్యమంత్రి జగన్..వైసీపీ ఎమ్మెల్యే ల ను లోకేశ్ టార్గెట్ చేస్తున్నారు. కడప జిల్లాలో యువగళం సక్సెస్ చేసేందుకు టీడీపీ శ్రేణులు శ్రమించారు. లోకేశ్ యాత్ర సీమలో పూర్తవుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో ప్రారంభమైంది. అదే సమయంలో కుప్పంలో చంద్రబాబు మూడు రోజులు పర్యటించారు.

ఇద్దరి లక్ష్యం ఒక్కటే..ఇద్దరికీ కీలకం : పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు స్పందన బాగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ కు సహజంగా ఉన్న ఆదరణతో పాటుగా జనసైనికులు ఈ సారి పవన్ యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో, పవన్ సభలకు బారీ జనస్పందన కనిపిస్తోంది. అనేక వర్గాల ప్రజలతోనూ పవన్ మమేకం అవుతున్నారు. పవన్ తన ప్రసంగాల్లో సీఎం జగన్..వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటంలో లోకేశ్ తో పోటీ పడుతున్నారు.

పవన్ ప్రసంగాలకు స్పందన ఉంటోంది. లోకేశ్ ప్రసంగాల్లో ఆ ధాటి..వేడి కనిపించటం లేదనే అభిప్రాయం ఉంది. ఇద్దరి లక్ష్యం ముఖ్యమంత్రి జగన్ అయినా.. ప్రసంగాల తీరులో మాత్రం పవన్ సంధిస్తున్న అస్త్రాలు సహజంగానే చర్చకు దారి తీస్తున్నాయి. అనూహ్యంగా టీడీపీ మద్దతు మీడియా కూడా ఎక్కువగా పవన్ ప్రసంగాలకు ప్రాధాన్యత ఇస్తోంది. పవన్ పర్యటన ప్రారంభం అయిన తరువాత లోకేశ్ కు ఆ మీడియాలో ప్రయార్టీ తగ్గిందనే అభిప్రాయం వినిపిస్తోంది.

pawanlokehsyathra

పవన్ రూటు మారుతోందా : టీడీపీకి అధికారం..తన రాజకీయ భవిష్యత్ కు బాటలు వేసుకోవటం లోకేశ్ యాత్రలో అసలు లక్ష్యం. పవన్ ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి అడుగు పెట్టటం..అవకాశం కలిసి వస్తే కింగ్ లేదా కింగ్ మేకర్ అవ్వటం టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నారు. లోకేశ్..పవన్ ఎవరి ద్వారా ప్రయోజనం కలిగినా అంతిమంగా లాభం కలిగేది టీడీపీ అధినేత చంద్రబాబుకే.

కానీ, పవన్ తన ప్రసంగాల్లో సీఎం పదవి..జనసేన ప్రభుత్వం అంటూ చేస్తున్న ప్రచారం మాత్రం టీడీపీకి నష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. టీడీపీకి తన అవసరం ఏంటో తెలుసుకున్న పవన్ పట్టు బిగిస్తున్నారు. లోకేశ్..పవన్ ఇద్దరి యాత్రల్లో ఇప్పటికైతే పవన్ కు ఆదరణ బాగుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి కొంత కాలం పవన్ యాత్ర సాగిన తరువాత ఇదే తరహాలో ఆదరణ ఉంటుందా లేదా అనేది చూడాలి. అదే సమయంలో పవన్ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+