లోకసభ ఎన్నికలు 2019 : అనకాపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండి

పట్టణం స్వరూపం, జన విస్తరణ
అనకాపల్లి పట్టణం 'శారదా నది' అనే చిన్న నది తీరాన ఉంది. ఇది సముద్ర మట్టానికి 26 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం తూర్పు కనుమలు విస్తరించిన భాగంలో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం అనకాపల్లి జనాభా 84,523. ఇందులో ఆడు, మగ వారు సమానంగా (50%) ఉన్నారు. అక్షరాస్యత 67% ఉంది (జాతీయ సగటు 59.5%). ఇక్కడ మగవారిలో 54%, ఆడువారిలో 46% అక్షరాస్యులు. మొత్తం జనాభాలో 10% వరకు ఆరు సంవత్సరాల లోపు వయసున్నవారు.
అనకాపల్లి టౌన్ చరిత్ర:- ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత గజపతులు, కాకతీయులు, కుతుబ్ షాహి రాజులు పాలించారు. సుమారు 1450 ప్రాంతంలో ఆర్కాటు నవాబు అధీనంలో అప్పలరాజు, ఇతర క్షత్రియ వంశీయులు దీనికి స్థానిక పాలకులైనారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో మహాత్మా గాంధీ వంటి జాతీయ నాయకులు అనకాపల్లిని దర్శించారు.
అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన పట్టణం. విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోనూ, ఉక్కునగరానికి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న అనకాపల్లి వ్యాపారపరంగా అభివృద్ధి చెందినది. చుట్టు ప్రక్కల పల్లెలకు ప్రధాన కూడలిగా ఉన్న అనకాపల్లి కొబ్బరి వ్యాపారానికి మరియు బెల్లం వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. ఈ ఊరికి దగ్గరగా ఉన్న బొజ్జన్న కొండ అని పిలిచే కొండమీద బౌద్ధారామం ఉంది. బొజ్జన్న అంటే బుద్ధుడని చెప్పుకుంటారు అక్కడి స్థానికులు.

అనకాపల్లి - రాజకీయం : రాజకీయంగా అనకాపల్లి ప్రశాంతతను చాటుకుంటుంది. రాజకీయ నేతల మద్య పోటీ నెలకొన్నప్పటికి అది సామరస్య వాతావరణంలో ఉంటుంది. ఇక్కడి ప్రజలు కూడా ఎక్కువ శాతం పొలం పనులు,బెల్లం కార్మాగారాల్లో పనిచేస్తూ ఉంటారు. ద్వేష పూరితంగా కాకుంగా స్నేహపూర్వకంగా మెలిగే అనకాపల్లి వాసులు రాజకీయ చైతన్యం కలిగి ఉంటారు. ఓట్లు వేయించుకున్న నాయకుడు ప్రజా సంక్షేమం కోసం పని చేయపోతే మరుసటి ఎన్నికల్లో ఆ నాయకుడిని ఓడించి చూపిస్తారు అక్కడి జనం.
ఇక అనకాపల్లి లోక్ సభ పరిదిలోని నియోజక వర్గాలను తెలుసుకుందాం:
చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట తో పాటు నర్సీపట్టణం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక అనకాపల్లి ఎంపీగా ముత్తం శెట్టి శ్రీనివాస రావు గెలుపొందారు. అనకాపల్లి లో 2011 జనాబా లెక్కల ప్రకారం స్త్రీ పురుషులు కలిసి 1,86,937 ఉన్నట్టు తెలుస్తోంది. అనకాపల్లిలో పురుషులతో స్త్రీలు ప్రతి రంగంలో పోటీ పడుతుండడం విశేషం.
పర్యాటక కేంద్రాలు: అనకాపల్లిలోని శారదా నదిపై రైల్వే బ్రిడ్జి దగ్గరలో ఉన్న పుడిమడక, ముత్యాలమ్మపాలెం, తంతడి బీచిలు అందమైనవి. ఏటికొప్పాక లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందినది.
అనకాపల్లి బెల్లం (Jaggery) ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి బెల్లం తయారీకి ప్రసిద్ధి. దీనిని ఆసియా మరియు ఆఫ్రికా దేశాలలో వినియోగిస్తారు. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్లనుండి కూడా బెల్లం తయారవుతుంది. చెరకు కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసి దాన్ని పెద్ద పెనంలో కాగ బెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను ఉంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టి దనాన్ని రైతు పరి భాషలో రాపు లేదా జేడు అంటారు.
రాజకీయంగా చూస్తే అనకాపల్లి లోక్‌సభ నియోకవర్గంలో 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ తొమ్మది సార్లు గెలిస్తే.. టిడిపి నాలుగ సార్లు గెలుపొందింది. 1962 లో ఏర్పాటైన అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి మిస్సుల సత్యనారాయణ మూర్తి రెండు సార్లు గెలవగా, ఎస్ఆర్ఏఎయస్ అప్పలనాయుడు మూడు సార్లు గెలిచారు. ఇదే పార్టీ నుండి కొణతాల రామకృష్ణ 1989,1991 లో టిడిపి అభ్యర్ది అప్పల నరసింహం పై గెలుపొందారు. ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాస రావు 1999 లో ఇక్కడి టిడిపి నుండి పోటీ చేసి లోక్‌సభ కు ఎన్నికయ్యారు. మరో మంత్రి అయ్య న్న పాత్రుడు సైతం ఇదే నియోజకవర్గం నుండి 1996 ఎన్నికల్లో గెలిచారు. 2009 ఎన్నికల్లో సబ్బం హరి కాంగ్రెస్ నుండి గెలవగా.. 2014 లో అవంతి శ్రీనివాస రావు విజయం సాధించారు.
ఇక, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీల నుండి ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది . టిడిపి నుండి సిట్టింగ్ ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తిరిగి పోటీ చేస్తారని చెబుతున్నా..ఆయన అసెంబ్లీకి పోటీ చేయటానికే ఎక్కు వగా అసక్తి చూపిస్తున్నారు. టిడిపిలో చేరేందుకు సిద్దంగా ఉన్న మాజీ ఎంపీ సబ్బం హరి పేరు సైతం అనకాపల్లి ఎంపి సీటు కోసం రేసులో ఉన్నారు. ఇక, వైసిపి నుండి గత ఎన్నికల్లో పోటి చేసిన ఓడిన గుడివాడ అమర్‌నాద్ తిరిగి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. విశాఖ రైల్వే జోన్ ఈ సారి ఇక్కడ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక, ఈ సారి జనసేన సైతం బరిలో ఉండాలని భావిస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన ఓ ఎన్నారై పేరు జనసేన నుండి ప్రముఖంగా వినిపిస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి అల్లు అరవింద్ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో..ఇక్కడ నుండి తమ సత్తా చాటాలని జనసేన భావిస్తోంది. బిజెపి..కాంగ్రెస్ అభ్యర్దులు పోటీకి దిగనున్నారు. బహుముఖ పోరుగా కనిపి స్తున్నప్పటికీ..ప్రధానంగా టిడిపి - వైసిపి మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది.