లోకసభ ఎన్నికలు 2019 : మచిలీపట్నం నియోజకవర్గం గురించి తెలుసుకోండి

మచిలీ పట్నం - చరిత్ర. క్రిష్నా జిల్లా కు ముఖ్యపట్టణంగా ఉన్న మచిలీపట్నం నియోజక వర్గానికి జిల్లాలో మంచి పేరుంది. సమకాలీన రాజకీయాలకు అనుగుణంగా అక్కడి ప్రజల్లో మార్పులు చోటు చేసుకోవడం మచిలిపట్నం ప్రత్యేకతగా చెప్పొచ్చు. బందరుకి మచిలీపట్నం అన్న పేరు రావటానికి వెనుక కథ ఒకటి ఉంది. సముద్రపుటొడ్డున ఉన్న కోట ద్వారం దగ్గర ఒక చేప విగ్రహం ఉండేది.
అందుకని ఈ ఊరికి మచిలీపట్నం అన్న పేరొచ్చిందంటారు. పట్నంతో ముగిసే పేర్లు గల ఊళ్ళు అన్ని తూర్పుకోస్తాలోనే ఉన్నాయి. 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీవారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం కూడా ఒకటిగా ఉండేది. ఈ పట్టణానికి
మచిలీపట్నం, బందరు అనీ మాత్రమే కాక పూర్వం మచిలీ బందరనే పేరు కూడా వ్యవహారంలో ఉండేది.
శాసన సభ నియోజక వర్గాలు. ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో మచిలీ పట్నం ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి. గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి. మొదటినుండి శాసన సభతో పాటు పార్లమెంటుకు జరిగే ఎన్నికలు అక్కడి ప్రజలు ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు. 1952 నుండి వివిద పార్టీల నుండి ఎవరెవరు పార్టమెంట్ స్థానంలో గెలుపొందారో ఒకసారి చూద్దాం.

పార్లమెంట్ సభ్యులు-పార్టీలు..! మొదటి సారి 1952-57 సనక బుచ్చికోటయ్య సీపిఐ(ఎం) పార్టీనుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. రెండవ సారి1957-62 వరకు మండలి వెంకట కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపికయ్యారు. మూడవ సారి 1962-67 లో ఎమ్.వి.స్వామి ఎంపిక కాగా, నాలుగవ సారి 1967-71 వై.అంకినీడు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీనుండి గెలుపొందారు. అయిదవ సారి 1971-77 లో మేడూరి నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీనుండి గెలిచారు. ఇక ఆరవ సారి 1977-80 మాగంటి అంకినీడు కాంగ్రెస్ నుంచి గెలవగా, ఏడవ సారి 1980-84 లో మాగంటి అంకినీడు మళ్లీ కాంగ్రెస్ పార్టీనుండి గెలిచారు. ఎనిమదవ సారి 1984-89 లో కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందగా, తొమ్మిదవ సారి 1989-91 లో మళ్లీ ఆయనే
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు.
పార్లమెంట్ సభ్యులు-పార్టీలు..! పదవ సారి 1991-96 కూడా కావూరి సాంబశివరావు కాంగ్రెస్ నుండి గెలవగా, పదకొండవ సారి 1996-98లో నటుడు కైకాల సత్యనారాయణ టీడిపి నుండి
గెలుపొందారు. పన్నెండవ సారి 1998-99లో మళ్లీ కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీనుండి గెలిచారు. పదమూడవ సారి 1999-04 లో అంబటి బ్రాహ్మణయ్య టీడిపి నుండి గెలవగా, పద్నాలుగవ సారి 2004-09లో బాడిగ రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. ఇక పదిహేనవ సారి 2009-14 లో కొనకళ్ళ నారాయణరావు టీడిపి నుండి ప్రస్తుతం వరకూ, 2014లో కూడా ఆయనే టీడిపి నుండి పదహారవ సారి 2014- కొనసాగుతున్నారు.
రద్దైన శాసనసభ స్థానాలు..! ఇక 2008 లో ఏడు నియోజక వర్గాలను ఇందులోనుంచిరద్దు చేసారు. అవి భద్రాచలం · బొబ్బిలి · హనుమకొండ · మిర్యాలగూడ · పార్వతీపురం · సిద్ధిపేట తెనాలి నియోజక వర్గాలను రద్దు చేసారు. అంతకు ముందు 1976లో గుడివాడ, కావలి నియోజక వర్గాలను కూడా ఈ పార్లమెంట్ పరిదినుండి ఉపసంహరించారు.
బందరు లడ్డు ప్రత్యేకం..! బందరులో 150 సంవత్సరాల క్రితం స్ధిరపడిన సింగుల కుటుంబాలు బందరు లడ్డుల సష్టికర్తలుగా చెపుతారు. బొందిలీలు అని కూడా పిలచే సింగుల కుటుంబాలు బందరులో ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. వీరిలో ఎవరు ఇప్పుడు ఈ లడ్డుల తయారీలో కానీ, ఈ వ్యాపారంలో కానీ
లేరు. ఆ కుటుం బాల వద్ద పనిచేసి లడ్డు తయారీ నేర్చు కున్న ఒకటి రెండు కుటుంబాలలో ఒక కుటుంబం ఇప్పటికీ ఆ వ్యాపారాన్ని విడచిపెట్టలేదు. అందుకే బందరు లడ్డు అనగానే బందరులో ఠక్కున శిర్విశెట్టి సత్యనారాయణ కేరాఫ్ తాతారావు పేరు చెపుతారు. తాతారావును ఇప్పటికీ మిఠాయి కొట్టు తాతారావుగా పిలుస్తుంటారు.