మాజీ మంత్రి కొడాలి నానికి లుక్ అవుట్ నోటీసులు జారీ

మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు సర్క్యులర్ పంపించారు. నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఏపీ పోలీసులు ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల ముంబైలో గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన అమెరికా వెళ్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు లుక్ ఔట్ సర్క్యులర్ జారీచేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా LOC జారీ చేశారు. తాజాగా కొడాలి నానికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు సర్క్యులర్ పంపించారు. ఈ నోటీసులు ఆన్‌లైన్‌ విధానం ద్వారా అన్ని ఎయిర్‌ పోర్టులు, ఓడరేవులకు అందాయి. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు.

కొడాలి నానిపై నమోదైన కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికపై నిఘా పెట్టాలని డీజీపీకి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె. శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. కొడాలి నాని అమెరికా వెళ్లకుండా ఆయన పాస్‌ పోర్టు సీజ్‌ చేయాలని కోరారు. దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్‌. గంగాధరరావు ప్రస్తుతం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.

Lookout Notice Issued Against Former Minister Kodali Nani

కొడాలి నానికి రాష్ట్రంలో పాస్‌పోర్టు లేనట్లు సమాచారం. అయితే హైదరాబాద్‌ చిరునామాతో పాస్‌పోర్టును పొంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన అమెరికా వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కొడాలి నానికి ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+