హైదరాబాద్ లోనే కాదు ఈ నగరాల్లోనూ ఇందిరమ్మ టవర్స్.. తీపికబురు చెప్పిన డిప్యూటీ సీఎం!

పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేసే వరకు ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అందిస్తోందని ఆయన అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు. మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికే 2.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 1.75 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.ప్రతి లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని నేరుగా, పారదర్శకంగా అందిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు.

indiramma towers in these cities too Every Eligible Poor Family Will Get Indiramma House Deputy CM Bhatti Vikramarka

ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నామని, లబ్ధిదారులు నిర్మాణ పనులు ఎంత వేగంగా పూర్తి చేస్తే అంత త్వరగా నిధులు అందుతాయని స్పష్టం చేశారు. ఈ పథకం పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతిల్లు కల్పించే వరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీపావళి సందర్భంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు.

గ్రామస్థాయి నాయకుల నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకుంటున్నారు. ఇది పేదల ఇళ్లలో ఆనందం నింపుతోంది. అదనంగా, ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.

రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని కూడా వివరించారు. కులం, మతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సొంత భూమి ఉన్నవారికి రూ.5 లక్షల సబ్సిడీతో ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో టవర్స్ రూపంలోనూ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.

నల్గొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి కార్పొరేషన్లలో జీ+5 టవర్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.ఈ పథకం ద్వారా గుడిసెల్లో నివసించే వేలాది కుటుంబాలు సొంతింటి సుఖాన్ని అనుభవిస్తున్నాయి. రెండో దశలో గుడిసెల్లో నివసించే వేలాది మందికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నిధులు పారదర్శకంగా అందడం వల్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది.

సొంత చెల్లినే గెంటేసిన మీరు మహిళా సంక్షేమం చేస్తారా? కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్!
సొంత చెల్లినే గెంటేసిన మీరు మహిళా సంక్షేమం చేస్తారా? కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్!

ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తుండటం వల్ల మధ్యవర్తుల జోక్యం తగ్గింది.పేదలకు సొంతిల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు. అది ఆత్మగౌరవం, భద్రత, భవిష్యత్తు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆ కలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+