పవన్ కు బొత్సా కీలక సూచన - చిరంజీవి స్వయంగా చెప్పారు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ భద్రత పైన కొత్త చర్చ మొదలైంది. తాజాగా కడప జిల్లాలో వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీవో ను పవన్ పరామర్శించారు. వైసీపీకి హెచ్చరిక చేసారు. ప్రభుత్వం పై ఇటు పోరుబాట మొదలు పెట్టింది. ఈ సమయంలోనే వైసీపీ ముఖ్య నేత బొత్సా కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కు సూచన చేసారు. చిరంజీవి అంశాన్ని ప్రస్తావించారు.
పవన్ పై బొత్సా కామెంట్స్
తాజాగా పవన్ కల్యాణ్ కడప పర్యటనలో వైసీపీ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు బొత్సా కౌంటర్ ఇచ్చారు. ఎంపీడీఓ పై దాడి జరిగిందని పరామర్శకు కడప వెళ్లిన పవన్, అదే జిల్లాలో బీరు బాటిల్ తో టీడీపీ నేతల దాడిలో గాయపడిన చంద్రమౌళి అనే వీఆర్వోనూ కూడా పరామర్శిస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. అందరికీ ఒకటే అని చెప్పుంటే బాగుండేదని సూచించారు. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా మార్చొద్దని బొత్స హితవు పలికారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేయడంపై బొత్స విస్మయం వ్యక్తం చేశారు. తప్పు జరిగితే తొక్క తీస్తానని తరచూ మాట్లాడే పవన్ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దీన్ని కూడా జగన్ ప్రభుత్వ వైఫల్యం అంటారేమోనని ఎద్దేవా చేశారు.

చిరంజీవే చెప్పారు
సినీ హీరోలను జగన్‌గారు నాడు అవమానించారనేది అవగాహన రాహిత్యమని బొత్సా వ్యాఖ్యానిం చారు. తనను సీఎం జగన్ ఎంతో గౌరవించారని చిరంజీవి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తాను డీజీపీ అన్న విషయాన్ని ప్రస్తుత డీజీపీ మర్చిపోయినట్టున్నా రని.. తాము ఫోన్ చేస్తే లిఫ్టు చేయటం లేదని చెప్పుకొచ్చారు. తనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలవటం పైన బొత్సా స్పందించారు. గతంలో లోకేష్‌ను, పవన్‌కళ్యాణ్‌ను కూడా కలిశానన్నారు. అందులో తప్పేముందన్నారు. కేవలం అభద్రతా భావంతో ఉన్న వాళ్లే ఇలాంటి విషయాలకు భయపడి అనవసర రాద్ధాంతం చేస్తారని చెప్పారు.
ఆ మంత్రి కలిస్తే
మంత్రి శ్రీనివాస్ మీద ఆ పార్టీలోనే కుట్ర జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో
కూటమి ప్రభుత్వం చేసిన లక్ష కోట్ల అప్పు ఏం చేశారని మాజీ మంత్రి నిలదీశారు. పెన్షన్ రూ.1000 పెంచినా, ఇప్పటికే వాటిలో 3 లక్షలు కోత పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోగా, యూనిట్ విద్యుత్‌కు పేదవాడి మీద రూ.1.20 అదనపు భారం వేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు నెలకు ఉచితంగా ఇస్తున్న 200 యూనిట్లు విద్యుత్ కూడా నిలిపేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పు చేయాడనికి సన్నద్ధమయిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications