వివాహితను ప్రియుడు రాయితో కొట్టి చంపి పూడ్చేశాడు
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడే ఆమను హత్య చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొరుటూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
గ్రామానికి చెదిన సంగాని పోచయ్య, సీతారత్న (39) దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. గత కొంత కాలంగా గర్రె రాంబాబు అనే వ్యక్తితో సీతారత్నం వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఆగస్టు 17వ తేదీన ఇద్దరు కలిసి సమీపంలోని గోదావరి ఇసుక తిన్నెలపైకి వెళ్లారు.

అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రాంబాబు సీతారత్నాన్ని రాయితో కొట్టి హత్య చేశాడు. మృతదేహాన్ని అక్కడే పూడ్చేశాడు. భార్య కనిపించకపోవడంతో పోచయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాంబాబుతో సీతారత్నం వివాహేతర సంబంధం పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో రాంబాబును పోలీసులు విచారించారు. రాంబాబు తన నేరాన్ని అంగీకరించాడు. శుక్రవారం సీతారత్నం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.












Click it and Unblock the Notifications