ప్రియుడే కావాలి, గర్భవతిని చేసి కాదంటున్నాడు: యువతి ధర్నా
హైదరాబాద్: ఆరేళ్ల పాటు ప్రేమించిన ప్రియుడితో తనకు పెళ్లి చేయాలని ఓ ప్రియురాలు విశాఖలోని పార్వతీపురం స్థానిక బెలగాంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్షకు దిగింది. ఇటీవల పోలీసుల కౌన్సెలింగ్‌లో తనను కాదన్నాడనే ఆవేదనతో ఆమె పోలీస్ స్టేషన్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

అనంతరం మంగళవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద దీక్షకు దిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన తనను కురుపాం మండలంకు చెందిన వరప్రసాద్ 2010 ఏప్రిల్ నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని తెలిపింది. శారీరకంగా సంబంధం పెట్టుకొని రెండుసార్లు గర్భవతిని చేసి ఇప్పుడు కాదంటున్నాడని వాపోయింది. ఈ విషయమై పెద్దలు చెప్పినా వినలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
వరప్రసాద్ మనసును కొందరు మార్చారని చెప్పారు. తమ కులంకే చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లక్షల కట్నం వస్తుందని చెప్పి అతనిని మార్చారని చెప్పింది. అనంతరం ఆమె అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చింది. కాగా, యువతి దీక్షకు పలువురు మద్దతు పలికారు. ఐద్వా, బీజేపీ, రైతు కూలీ సంఘం, సిపిఎం తదితరుల మద్దతు లభించింది.












Click it and Unblock the Notifications