ట్విస్ట్: ఒకరిని ప్రేమించి మరోకరితో పెళ్ళి, భార్యకు షాకిచ్చిన ప్రేమజంట
శ్రీకాకుళం:పెళ్ళైన భార్య ఉన్నా, పెళ్ళికి ముందు ప్రియురాలితో ప్రేమ బంధాన్ని తెంచుకోలేకపోయాడు. ప్రేమికులు గురువారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో చోటు చేసుకొంది.
శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలసకు చెందిన అమలాపురం అప్పలరాజు, బడుమూరు పద్మలు కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. అప్పలరాజు తన కటుంబసభ్యులతో కలిసి బెండిగేటు సమీపంలోని నందిగామ మండలం కవిటి అగ్రహరం వద్ద ఇటుకల పరిశ్రమలో పనిచేస్తున్నాడు.
అప్పలరాజుకు ఆయన పెద్దక్క కూతురు లావణ్యతో 2015లోనే వివాహమైంది. వీరికి ఆరు నెలల బాబు కూడ ఉన్నారు. లావణ్యతో వివాహనికి ముందు నుండి పద్మతో అప్పలరాజులు ప్రేమించుకొంటున్నారు.

ప్రేమ ఒకరితో పెళ్ళి మరోకరితో
అప్పలరాజు పెళ్ళి కి ముందు నుండి పద్మను ప్రేమిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే కారణాలు ఏమిటో తెలియదు కానీ, అక్క కూతురు లావణ్యను అప్పలరాజు వివాహం చేసుకొన్నాడు. అయితే లావణ్యను వివాహం చేసుకొన్నప్పటికీ కూడ పద్మతో సంబంధాలను అప్పలరాజు కొనసాగిస్తున్నాడు. కానీ, చేతిలో చేయి వేసుకొని రైలు పట్టాలపై తలలు పెట్టి ఇద్దరూ కూడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన పలువురిని కంటతడిపెట్టిస్తోంది.

తరచూ కలుసుకొనే ప్రేమికులు
అప్పలరాజుకు వివాహమైన తర్వాత కూడ పద్మను తరచూ కలుసుకొనేవారు. తాము ఎప్పుడూ కలుసుకొనే ప్రాంతానికి చేరుకొని అక్కడికి సమీపంలోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అప్పలరాజు భార్య లావణ్య పరిస్థితి దయనీయం
2015లో లావణ్య తో అప్పలరాజు వివాహమైంది.కానీ, వారిద్దరికి ఓ కొడుకు కూడ ఉన్నాడు. కానీ, పెళ్ళికి ముందు నుండి ప్రియురాలితో ఉన్న ప్రేమను అప్పలరాజు చంపుకోలేకపోయాడా, ఇంకా ఇతరత్రా ఏమైనా కారణాలతో ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అసలే పేదరికం. ఇటుకలో బట్టీలో పనిచేస్తేనే పూటగడిచేది. ఈ తరుణంలో అప్పలరాజు మృతి లావణ్యను ఆమె కొడుకును దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది.

తలలు, మొండాలలు వేరుగా
ప్రేమ జంట రైలు పట్టాలపై తలలు పెట్టడంతో తలల నుండి మొండాలు వేరుపడ్డాయి. ఇద్దరి తలలు పట్టాలకు అవతలి వైపుకు ఎగిరిపడ్డాయి. ఈ ఘటన చూస్తేనే ఒళ్ళ గగుర్పొడుస్తోంది. కదలకుండా ఇద్దరు కూడ చేతిలో చేయి వేసుకొని పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకొన్నారు. మృతదేహలను పోస్ట్ మార్టం కు పంపారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications