వివాహేతర సంబంధం: ప్రియురాలి శవం వద్ద ఏడుస్తూ విషయం చెప్పాడు!
గుంటూరు: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ప్రియురాలి మృతదేహం వద్ద ఏడుస్తూ ఆమె చావుకు కారణం వెల్లడించాడు ఓ ప్రియుడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పేరేచర్లకు చెందిన బాబావలి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు.
బాబావలి వివాహానికి ముందు మేడికొండూరుకు చెందిన మహిళ (35)ను ప్రేమించాడు. కానీ ఆమెకు గుంటూరుకు చెందిన బేకరీ నిర్వాహకుడు వినయ్‌తో వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే వివాహం జరిగినా ఇద్దరిలోనూ మార్పు రాలేదు. వివాహేతర సంబంధం కొనసాగించారు.
దీంతో వీరు రహస్యంగా కలుసుకునేందుకు ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. వీరి వ్యవహారం మొత్తం తెలియడంతో భర్త.. భార్యను నిలదీశాడు. భర్తతో గొడవబడిన భార్య.. పిల్లలను వదిలేసి ఆమె ప్రియుడి వద్దకు వెళ్లింది.

అద్దెకు తీసుకున్న గదిలో ఉంటోంది. ఇదే విషయంలో బాబావలి కుటుంబంలో కూడా కలతలు వచ్చాయి. దీంతో కలిసి బతికేందుకు ఇబ్బందులని భావించిన వారిద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 17వ తేదీ రాత్రి పురుగు మందు తాగారు.
ఆ పురుగుల మందును ఆమె ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో స్పృహ కోల్పోయింది. తక్కువ మోతాదులో తీసుకున్న బాబావలికి బతుకు మీద ఆశపెరగడంతో ఆమెను భుజాన వేసుకుని పేరేచర్ల మెయిన్ రోడ్డుకి వచ్చి, అటుగా వెళ్తున్న వ్యాన్‌లో ఆసుపత్రికి తరలించాడు.
కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కాగా, ఆమె చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ సందర్భంగా ఆమె కుటుంబంలో మనస్పర్ధల కారణంగా పురుగు మందు తాగినట్లు చెప్పింది. బావాబలి కూడా తొలుత అదే చెప్పాడు. అనంతరం ఆమె మృతి విషయం తెలుసుకున్న అతను మృతదేహం వద్దకు వచ్చి బోరున విలపిస్తూ అసలు విషయం చెప్పేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications