దూసుకొస్తున్న తుఫాను, 4 రోజులు భారీ వర్షాలు- ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!!

ఏపీ వైపు మరో తుఫాను దూసుకొస్తోంది. మలక్కా జలసంధి, దానికి ఆనుకుని మలేషియా పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారం నాటికి దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ప్రస్తుతం ఏర్పడిన రెండు అల్పపీడనాలు బలపడి ఈ నెల 29 నాటికి తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తా తీరం వైపు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో ఈ 29వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, అక్కడక్కడ భారీగా, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అయితే ఇవాళ శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు.

Low pressure over Bay of Bengal may grow into Cyclone Senyar heavy rain expected in Coastal districts

ఈ నెల 29వ తేదీన.. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశంతొ పాటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఈ నెల 30వ తేదీ, డిసెంబర్ 1న కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

కాగా, ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 2న కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతా ల్లో, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఏపీలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ నేపధ్యంలో మత్స్యకారులు, రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 26 నుంచి 28 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో.. తుఫాను గమన పై అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+