వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం!

నైరుతి బంగాళాఖాతం మీదగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏర్పడే అల్ప పీడనంవల్ల ఏపీలో వర్షాలు కురవనున్నాయి. శుక్రవారం ఉదయానికి ఇది వాయుగుండంగా మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

మే 23, గురువారం
కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలతోపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు తేలికపాటి జల్లులు కురుస్తాయి.

Low pressure turning into an air mass rain alert for ap

మే 24, శుక్రవారం
కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి జల్లులు కురుస్తాయి. అలాగే మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి.

మే 25, శనివారం
అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి జల్లులతోపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయి. వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కాకినాడ, శ్రీ సత్య సాయి, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్లకింద ఉండొద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+