ఏపీకి తిరిగొచ్చిన లులు: చంద్రబాబుతో చైర్మన్ అలీ భేటీ, ఆ సిటీల్లో మాల్స్, మల్టీఫ్లెక్స్‌లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై ఈ సందర్భంగా చర్చించారు. విశాఖపట్నంలో మాల్, మల్టీఫ్లెక్స్, హైపర్ మార్కెట్ ఏర్పాటు తోపాటు విజయవాడ, తిరుపతిలో మల్టీఫ్లెక్స్ ల నిర్మాణంపై చర్చలు జరిపారు.

లులు బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ లో పోస్టు చేశారు. లులు ప్రతినిధులకు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని, ఏపీ అభివృద్ధిలో పాల్గొనే భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Lulu Chairman Yusuf Ali met AP CM Chandrababu

కాగా, 2019 నవంబర్‌లో లులూకు కేటాయించిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. నవంబర్ 2019లో YSRCP అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత, గల్ఫ్‌కు చెందిన లులూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టబోమని ప్రకటించింది.

వైజాగ్‌లోని బీచ్ రోడ్డులో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయడానికి 2014, 2019 మధ్యకాలంలో లులూ గ్రూప్‌నకు పూర్వ టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత వారి నిర్ణయం వచ్చింది.

లులూ గ్రూప్ 2019లో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ. 2,200 కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 2018లో మెగా కన్వెన్షన్ సెంటర్‌కు పునాది వేసింది. గత టీడీపీ ప్రభుత్వం లులు గ్రూప్‌కు భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయని భావించిన జగన్ మంత్రివర్గం ఆ కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ నుంచి లులు వెల్లిపోయింది.

తాజాగా, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటం, చంద్రబాబు చొరవతో మళ్లీ లులు గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తిరిగి రావడం గమనార్హం. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పడంతో.. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ సిద్ధమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+