వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ స‌న్నిహితుడికి ప‌ద‌వి : జూనియ‌ర్ ఎన్టీఆర్ కోస‌మేనా: సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మ‌క నిర్ణ‌యం...!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంతి జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌కీయంగా వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టే వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. అందులో భాగంగ టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీ ఆర్ స‌న్నిహితుడికి కీల‌క ప‌ద‌వి ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. దీని ద్వారా నంద‌మూరి కుటుంబ స‌భ్యులు..ప్ర‌ధానంగా హ‌రికృష్ణ ఫ్యామిలిని ఆక‌ర్షించేందుకు ఈ ఎత్తుగ‌డ వేసిన‌ట్లు క‌న‌పిస్తోంది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు చేయ‌లేన‌ది తాను చేయ‌టం ద్వారా నంద‌మూరి కుటుంబంతో పాటుగా ఎన్టీఆర్ అభిమానుల్లోనూ ఇమేజ్ సంపాదించాల‌నేది సీఎం ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. అందులో భాగంగానే హ‌రికృష్ణ కుటుంబంలో ఒక్క‌డిగే మెలిగే ఆ వ్య‌క్తికి ఏరి కోరి ఈ ప‌దవి ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు.

హ‌రికృష్ణ ఆప్త మిత్రుడుకి కీల‌క ప‌ద‌వి..

హ‌రికృష్ణ ఆప్త మిత్రుడుకి కీల‌క ప‌ద‌వి..

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు..మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌కు అత్యంత స‌న్నిహ‌తుడు..నంద‌మూరి హ‌రికృష్ణ‌కు ఆప్త మిత్రు డు అయిన యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్‌కు కీల‌క ప‌ద‌వి ద‌క్క‌నుంది. ఈ మేర‌కు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకు న్నారు. నంద‌మూరి కుటుంబ స‌భ్యుల‌తో అతి స‌న్నిహిత సంబంధాలు ఉన్న యార్ల‌గ‌డ్డ తొలుత చంద్ర‌బాబుతోనూ మంచి సంబంధాలే న‌డిపారు. ఎన్టీఆర్‌కు హిందీ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌గా ఉండేవారు. టీడీపీ నుండి రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ వ్య‌వ‌హ‌రించారు. వైయ‌స్ సూచ‌న‌తో హిందీ అకాడ‌మీ ఛైర్మ‌న్‌గానూ వ్య‌వ‌హ‌రించారు. ఇక‌..హరికృష్ణ మంత్రి ప‌ద‌వి రెండో సారి ఇవ్వ‌క‌పోవ‌టంతో యార్ల‌గ‌డ్డ ఆనాటి నుండి చంద్ర‌బాబుతోనూ దూరంగా ఉంటున్నారు. ఇక ర‌కంగా చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఉన్నారు. అదే స‌మ‌యం లో టీడీపీ..చంద్రబాబు..నంద‌మూరి కుటుంబంతో అతి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఆయ‌న ఇప్పుడు చంద్ర‌బాబుతో దూరం పాటి స్తున్నారు. అయితే, నంద‌మూరి హ‌రికృష్ణ కుటుంబంతో మాత్రం తొలి నుండి మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో.. ఇప్పుడు భ‌విష్య‌త్ వ్యూహాల‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

అధికార భాషా సంఘం ఛైర్మ‌న్‌గా..

అధికార భాషా సంఘం ఛైర్మ‌న్‌గా..

యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ ఏపీ అధికార భాషా సంఘం ఛైర్మ‌న్‌గా నియ‌మించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యించారు. తెలుగు బాష అభివృద్దికి త‌మ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని చెప్పిన సీఎం..ఆ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు . బాషాభిమానిగా..అనేక ప్రాంతాల్లో తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హించిన యార్ల‌గ‌డ్డ ప‌ద్మ‌విభూష‌న్ అవార్డు అందుకున్నా రు. ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు..జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్ వంటి వారితో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. సాహిత్య అకాడ‌మీ అవార్డు సైతం ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత సి నారాయ‌ణ‌రెడ్డి గ‌రించి రాసిన పుస్త‌కం ముఖ్య‌మంత్రితో ఆవిష్క‌రించేలా యార్ల‌గ‌డ్డ ఒప్పించి..ఆ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో అధికార భాషా సంఘం ఛైర్మ‌న్‌గా ఎవ‌రినీ నియ‌మించ‌లేదు. అంత‌కు ముందు మండ‌లి బుద్ద ప్ర‌సాద్ అధ్య‌క్షుడిగా ప‌ని చేసారు. తిరిగి ఇప్పుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ నియామ‌కం పైన నిర్ణ‌యం తీసుకున్నారు. యార్ల‌గ‌డ్డ ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా ప‌ని చేసారు.

 నంద‌మూరి కుటుంబం కోస‌మేనా..

నంద‌మూరి కుటుంబం కోస‌మేనా..

ఇప్ప‌టికే చంద్ర‌బాబుతో నంద‌మూరి కుటుంబంలో కొంత మంది దూరం పాటిస్తున్నారు. ఈ గ్యాప్‌ను త‌మ‌కు అనుకూ లంగా మ‌ల‌చుకొనేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డలు వేస్తున్నారు. 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ కోసం విస్తృతంగా ప్ర‌చా రం చేసి ప్ర‌చారం మ‌ధ్య‌లో గాయ‌ప‌డిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆ త‌రువాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇక‌, లోకేశ్ పార్టీలోకి ఎంట్రీ త‌రువాత జూనియ‌ర్‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసారు. త‌న సోద‌రి తెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీ నుండి పోటీ చేసినా జూనియ‌ర్ ప్ర‌చారానికి వెళ్లలేదు. పూర్తిగా సినిమాల‌కే ప‌రిమితం అయిన జూనియ‌ర్ అవ‌స‌రం ఇప్పుడిప్పుడే టీడీపీ అధినాయ‌క‌త్వం గుర్తిస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జూనియ‌ర్‌ను రంగంలోకి దించాని పార్టీ అధినేత వ‌ద్ద కొంద‌రు ముఖ్యులు సూచిస్తున్నారు. దీంతో..ఇప్ప‌టికే జూనియ‌ర్ మామ అయిన నార్నే శ్రీనివాస‌రావును వైసీపీలో చేర్చుకున్న జ‌గ‌న్‌..ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ తండ్రికి అత్యంత ఆప్తుడైన యార్ల‌గ‌డ్డ‌కు ప‌ద‌వి ఇవ్వ‌టం ద్వారా భ‌విష్య‌త్ స‌మీక‌ర‌ణాల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకొనే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

English summary
AP CM Jagan decided to appoint Yarlagadda Lakhsmi Prasad as Adhikara Basha Sangham Chairman. Yarlagadda very close to nandamuri family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X