• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్ - గ్యాప్..అపోహలు వారి వల్లేనంటూ : ఇద్దరి తాజా నిర్ణయం అదే...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

"మా" ఎన్నికలు ముగిసినా ఆ సమయంలో తలెత్తిన విభేదాలు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. "మా" వివాదాల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేరుగా మోహన్ బాబుకు ఫోన్ చేసారు. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. కీలక అంశాల పైన చర్చించారు. ఇద్దరు మాట్లాడకున్న విషయాన్ని "మా" నూతన అధ్యక్షుడు విష్ణు నిర్ధారించారు. "మా" ఎన్నికల్లో గెలిచిన విష్ణుతో సహా ఆయన ప్యానల్ సభ్యులు ప్రమాణ స్వీకారం సైతం పూర్తయింది. కానీ, ప్రకాశ్ రాజ్ ఎన్నికల నిర్వహణ తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు.

"మా" వివాదంలో ట్విస్టులు

తాను ఎన్నికల్లో ఓడినా... విష్ణు మంచి పనులు చేస్తే మద్దతిస్తానని..ప్రతీ నెలా ఆయన చేసిన పనుల రిపోర్టు అడుగుతానని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో విష్ణు ఎవరికీ రిపోర్టు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రతీ నెలా వెబ్ సైట్ లో రిపోర్టు పెడతామంటూ ప్రమాణ స్వీకారం వేళ కామెంట్ చేసారు. ఇదే సమయంలో పోలింగ్ నాడు మోహన్ బాబు..నరేశ్ తమ సభ్యుల మీద దాడి చేసిన విషయాన్ని ప్రకాశ్ రాజ్ పలు మార్లు ప్రస్తావించారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి..ప్రస్తుతం దూరంగా ఉన్నారు.

మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్

మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్

దీని పైన విష్ణు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈసీ కమిటీ సమావేశంలో చర్చిస్తామని చెబుతూ..ఇక "మా" ఎన్నికల గురించి తాము మాట్లడబోమని తేల్చి చెప్పారు. అయితే, ఈ ఎన్నికలు జరిగింది విష్ణు వర్సెస్ ప్రకాశ్ రాజ్ అయితే, వాస్తవంగా వార్ మాత్రం మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అన్నట్లుగా సాగింది. ప్రకాశ్ రాజ్ కు చిరంజీవి మద్దతిస్తున్నారనే ప్రచారం ఆయన పోటీలో ఉంటానని ప్రకటించిన సమయం నుంచి కొనసాగుతోంది. అయితే, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయం పైన స్పష్టత ఇచ్చారు.

నాగబాబు..మోహన్ బాబు నాడు అలా..

నాగబాబు..మోహన్ బాబు నాడు అలా..

అన్నయ్య సైతం ప్రకాశ్ రాజ్ కు మద్దతిస్తున్నారని చెప్పారు. ఇక, మోహన్ బాబు టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సైతం చిరంజీవి తనకు ఫోన్ చేసి తాను ప్రకాశ్ రాజ్ కు మాట ఇచ్చానని..విష్ణు పోటీ గురించి అడిగారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తానిచ్చిన సమాధానం గురించి వివరించారు. ఇక, ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత విష్ణు సైతం చిరంజీవి గురించి కీలక అంశాలను చెప్పుకొచ్చారు. చిరంజీవి తనకు ఫోన్ చేసి పోటీ నుంచి తప్పుకోమన్నారని..అయితే, నాన్న ఒప్పుకోలేదని వివరించారు.

మధ్యంలో గ్యాప్ క్రియేట్ చేస్తున్నారంటూ

మధ్యంలో గ్యాప్ క్రియేట్ చేస్తున్నారంటూ

కానీ, ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదాల నడుమ చిరంజీవి నేరుగా మోహన్ బాబుకు ఫోన్ చేసారు. జరుగుతున్న పరిణామల పైన వారిద్దరూ చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. అకారణంగా తన పేరు ప్రచారం చేసారని..తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేదని చెప్పారని తెలుస్తోంది. అయితే, మోహన్ బాబు సైతం సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. జరిగిపోయిందేదో జరిగిపోయిందని..అందరం కలసికట్టుగా ఉండాలని పేర్కొన్నట్లుగా సమాచారం.

త్వరలో ముఖా ముఖి సమావేశం

త్వరలో ముఖా ముఖి సమావేశం

ఒక తల్లి బిడ్డలుగా కలిసి ఉండాలనేది తన ఆలోచనగా చెప్పగా..చిరంజీవి సైతం అందుకు సానుకూలంగా స్పందించారని..త్వరలోనే వీరిద్దరు ముఖా ముఖి కలుసుకే అవకాశం ఉందని తెలుస్తోంది. చిరంజీవి "మా" ఎన్నికల రోజు సాయంత్రం ఇక మూవీ వేడుకలో "మా" ఎన్నికల తీరు.. రెండేళ్ల పదవీ కాలం కోసం ఇంత రచ్చ అవసరమా అని ప్రశ్నించారు. దీనికి విష్ణు ప్రమాణ స్వీకార సమయంలో మోహన్ బాబు పరోక్షంగా స్పందించారు. రెండేళ్ల పదవి..ఎన్నేళ్ల పదవి అనేది సమస్య కాదని.. సీటును గౌరవించాలని వ్యాఖ్యానించారు.

  Exclusive Interview with Bigg Boss 5 Contestant Hamida || Oneindia Telugu
  విష్ణు నిర్ణయాల పైన ఆసక్తి

  విష్ణు నిర్ణయాల పైన ఆసక్తి


  ఈ ఫోన్ కాల్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తిరుపతి టూర్ లో ఉన్న విష్ణు సైతం తన ప్యానల్ సభ్యులతో కలిసి చిరంజీవిని కలవనున్నారు. చిరంజీవి..మోహన్ బాబు ఇద్దరూ ఇప్పుడు ఓపెన్ గా తమ అభిప్రాయాలు షేర్ చేసుకోవటంతో.."మా" వివాదం వీరిద్దరి మధ్య ముగుస్తుందా లేద అనేది చూడాల్సి ఉంది. అదే సమయంలో..విష్ణు వర్సెస్ ప్రకాశ్ రాజ్ వివాదం మాత్రం కంటిన్యూ అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  English summary
  Amid the MAA Elections issue raking up, Chiranjeevi had called Mohan babu and said that he had not supported the Prakash Raj panel.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X