Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘మా’ ఎన్నికల విజేతల ఫైనల్ లిస్టు-ఎవరికెన్ని ఓట్లు : అనసూయ ఓటమి-సుడిగాలి సుధీర్ గెలుపు..!!

ప్రతిష్ఠాత్మకంగా సాగిన 'మా' ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు పోలింగ్ ముగిసిన తరువాత ఆదివారం రాత్రే ప్రకటించారు. అదే విధంగా ఆఫీసు బేరర్ల పేర్లను వెల్లడించారు. అయితే, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది మాత్రం స్పష్టత రాలేదు. అదే విధంగా ఎగ్జిక్యూటివ్ సభ్యుల్లో మొత్తం 18 మందికి గాను, విష్ణు ప్యానల్ నుంచి 10 మంది.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 8 మంది గెలుపొందారు. వారి పేర్లు..దక్కించుకున్న ఓట్లను సైతం వెల్లడించారు.

ఈసీ మెంబర్ గా అనసూయ ఓటమి

ఈసీ మెంబర్ గా అనసూయ ఓటమి

ఆదివారం రాత్రి ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన అనసూయ గెలిచినట్లుగా ప్రచారం సాగినా.. తుది జాబితాలో ఆమె పేరు లేదు. జబర్ధస్త్ ఫేం సుడిగాలి సుధీర్ ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గెలిచారు. మా అధ్యక్షుడు - మంచు విష్ణు (383 ఓట్లు). ప్రకాశ్‌రాజ్‌ (274 ఓట్లు). రావటంతో 109 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందారు. అదే విధంగా.. జనరల్ సెక్రటరీ గా రఘుబాబు (341 ఓట్లు) రాగా గెలిచారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - శ్రీకాంత్ (375 ఓట్లు) ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసి బాబు మోహన్ మీద నెగ్గారు.

ఆఫీసు బేరర్లలో ఇద్దరు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి

ఆఫీసు బేరర్లలో ఇద్దరు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి

అదే విధంగా.. జాయింట్ సెక్రటరీలు గా రెండు క్యాంపుల నుంచి ఉత్తేజ్ (333 ఓట్లు) , గౌతంరాజు (322 ఓట్లు) ఇద్దరు గెలిచారు. వైస్ ప్రెసిడెంట్స్‌ - మాదాల రవి (376 ఓట్లు), బెనర్జీ (298 ఓట్లు) ఇద్దరూ రెండు పదవులు దక్కించుకున్నారు. కోశాధికారి గా విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేసిన శివబాలాజీ (360 ఓట్లు) తో గెలుపొందారు. ఈసీ మెంబర్ల జాబితా ను సైతం ఎన్నికల అధికారులు వెల్లడించారు. 18 మంది ఈసీ సభ్యుల కోసం జరిగిన పోటీలో 10 మంది మంచు విష్ణు ప్యానల్‌కు చెందినవారు, ఎనిమిది మంది ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు చెందినవారు గెలుపొందారు.

Recommended Video

    MAA Elections: MAA Elections 2021 Results | Oneindia Telugu
    ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా గెలిచింది వీరే

    ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా గెలిచింది వీరే

    అందులో.. శివారెడ్డి (362 ఓట్లు), గీతా సింగ్‌ (342 ఓట్లు), అశోక్‌ కుమార్‌ (336 ఓట్లు), బ్రహ్మాజీ (334 ఓట్లు), శ్రీలక్ష్మీ (330 ఓట్లు), సి.మాణిక్‌ (326 ఓట్లు), ప్రభాకర్‌ (319 ఓట్లు), తనీష్‌ (306 ఓట్లు), శ్రీనివాసులు (296 ఓట్లు), హరనాథ్‌బాబు (296 ఓట్లు), సురేశ్‌ కొండేటి (294 ఓట్లు) ఉన్నారు. వీరితో పాటుగా.. ఎన్‌.శివన్నారాయణ (290 ఓట్లు), సంపూర్ణేశ్‌బాబు (285 ఓట్లు), శశాంక్‌ (284 ఓట్లు), సమీర్‌ (282 ఓట్లు), సుడిగాలి సుధీర్‌ (279 ఓట్లు), బొప్పన విష్ణు (271 ఓట్లు), కౌశిక్‌ (269 ఓట్లు) గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా, మొత్తంగా 'మా' లో 985 ఓటర్లకు 883 మందికి ఓటు హక్కు ఉంది. కాగా, అందులో ఎన్నికల రోజున 605 మంది ఓటు వేయగా..మరో 54 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో..'మా' ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+