ప్రకాశ్ రాజ్ సపోర్టింగ్ హీరోలు వీళ్లే- తేల్చేసిన నాగబాబు : చిరంజీవి చెప్పారు - వకీల్ సాబ్ కు ఏపీలో నష్టం..!!
"మా " ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. లోకల్ - నాన్ లోకల్ తో మొదలై..ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఇప్పుడు ఏకంగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకోవటం దాకా వెళ్లింది. తాజాగా... ప్రత్యర్ధి ప్యానల్ కు ఓటు వేస్తారా అంటూ బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా "మా " అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న మంచు విష్ణు తన మేనిఫెస్టో విడుదల చేసారు. ఇక, మూడు రోజుల్లో పోలింగ్ జరగనుంది. తాజాగా ఎవరికి వారు తమ విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నాగబాబు తేల్చి చెప్పేసారు..
ఈ సమయంలో నాగబాబు ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ మద్దతు గురించి ఓపెన్ అయిపోయారు. ఆరు నెలల క్రితమే ప్రకాశ్ రాజ్ కు మద్దతిచ్చామంటూ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నాగబాబు వెల్లడించారు. చిరంజీవి "మా " ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు మద్దతివ్వమని చెప్పారని స్పష్టం చేసారు. ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్ ఈ విషయం నేరుగా చెప్పటానికి సంశయించారు. అదే సమయంలో తాము ఎవరమూ విష్ణును పోటీ నుంచి తప్పుకోమని అడగలేదని చెప్పుకొచ్చారు.

మోహన్ బాబు ప్రెసిడెంట్ గా ఉండగా..
తన కంటే ముందుగా మోహన్ బాబు "మా "అధ్యక్షుడిగా చేసారని..ఆ సమయంలో "మా " కార్యాలయం లోపలకు వెళ్లాలంటేనే సభ్యులు భయపడ్డారని గుర్తు చేసారు. తాజాగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రకాశ్ రాజ్ కోర్టుకు వెళ్లి..ఎన్నికలు ఆపించే అధికారం ఉందని..అయితే, వయసులో చిన్నవాడు అయిన విష్ణు అంటూ..ఎన్నికలు వాయిదా కోరుకోవటం లేదన్నారు. ఇక, రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేమి ఉందని నాగబాబు ప్రశ్నించారు.

వకీల్ సాబ్ కు నష్టం జరిగింది
వకీల్ సాబ్ విడుదల సమయంలో ఏపీలో కొన్ని ఇబ్బందులో నష్టం జరిగిందన్నారు. పవన్ తన ప్రసంగంలో ప్రభుత్వం పైన విమర్శలు చేసారని..తన మీద కోపం ఉంటే తన సినిమాలు ఆపమని చెప్పారు కానీ, సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టవద్దని కోరిన విషయం ఎందుకు ఎవరూ మాట్లాడరని ప్రశ్నించారు. పవన్ సైతం ప్రకాశ్ రాజ్ గురించి లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడవద్దంటూ సూచించారని గుర్తు చేసారు. "మా " ఓటర్ల వద్దకు వెళ్లి.. స్వీట్లు ఇవ్వటం... చీరలు పంచటం లాంటివి జరుగుతన్నాయని వివరించారు.

ప్రకాశ్ రాజ్ కు మద్దతిస్తున్న హీరోలు..
ప్రకాశ్ రాజ్ కు అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయని..తమకు 20 ఏళ్లుగా పరిచయం ఉందని వివరించారు. ఇక, మెగాస్టార్.. మెగా హీరోలు..తమ కుటుంబమే కాదని..చాలా మంది ప్రకాశ్ రాజ్ కు మద్దతిస్తున్నారంటూ వారి పేర్లు చెప్పుకొచ్చారు. హీరోలు మహేష్ బాబు... జూనియర్ ఎన్టీఆర్.. ప్రభాస్ వంటి వారితో పాటుగా చాలా మంది హీరోలు ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా నిలిచారంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఇది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఫలితాలపైన ఉత్కంఠ..ఎవరికి వారు ధీమా
అయితే, అసలు తాను ఓటు వేయనని..జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇబ్బందిగా ఉందంటూ జూనియర్ తనతో చెప్పారని నాలుగు రోజుల క్రితం జీవిత చెప్పుకొచ్చారు. అసలు..ప్రతీ సారి "మా " ఓటింగ్ లో హీరోలు చాలా తక్కు సంఖ్యలో హాజరవుతారు. ఇప్పుడు ఈ వివాదాల నేపథ్యంలో అసలు హీరోలు ఎవరెవరు ఓటింగ్ కు వస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఈనెల 10వ తేదీన పోలింగ్..అదే సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ సారి బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతుండటంతో అర్ద్రరాత్రికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఫలితాల తరువాత "మా " లో పరిస్థితి ఎలా ఉంటుందనే దాని పైన చర్చలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications