వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచు విష్ణు రివర్స్‌ ట్వీట్..డిలీట్: చిరంజీవి టీమ్ జగన్‌ను కలిసిన వేళ..ఏం జరుగుతోంది?

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో భారీ బడ్జెట్ సినిమాల సందడి ఇంకొద్దిరోజుల్లో మొదలు కాబోతోంది. వందల కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిన సినిమాలను వరుసబెట్టి విడుదల కానున్నాయి. ప్రేక్షకులను పలకరించనున్నాయి. పవన్ కల్యాణ్-రానా నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లానాయక్, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ ఆర్, ప్రభాస్-పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన రాధేశ్యామ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు, కీర్తిసురేష్ సర్కారువారి పాట, మెగాస్టార్ నటించిన ఆచార్య..ఇవన్నీ ఉప్పెనలా అభిమానులను ముంచెత్తనున్నాయి.

చిరంజీవి అండ్ టీమ్ కోసం అంబానీ ఫ్లైట్: రిలయన్స్ విమానంలో విజయవాడకు: వైసీపీ ఎంపీ లాబీయింగ్?చిరంజీవి అండ్ టీమ్ కోసం అంబానీ ఫ్లైట్: రిలయన్స్ విమానంలో విజయవాడకు: వైసీపీ ఎంపీ లాబీయింగ్?

కొలిక్కి రాని టికెట్ల వ్యవహారం..

కొలిక్కి రాని టికెట్ల వ్యవహారం..

ఈ పరిస్థితుల్లో- ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం కొలిక్కి రాకపోవడం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలను కలవరపాటుకు గురి చేస్తోంది. సినిమా టికెట్లపై ప్రభుత్వ నియంత్రణ తొలగిపోతే గానీ.. సినిమా చిత్రీకరణపై పెట్టిన ఖర్చు వెనక్కి రాదనే ఆందోళన నిర్మాతల్లో నెలకొని ఉంది. టికెట్ల రేట్లను పెంచుకునే విషయంపై ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానిని కలిసినప్పటికీ.. పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. రేట్ల వ్యవహారంలో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

వైఎస్ జగన్‌తో భేటీ..

వైఎస్ జగన్‌తో భేటీ..

ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడానికి టాలీవుడ్ పెద్దలు కొద్దిసేపటి కిందటే విజయవాడకు చేరుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకులు ఎస్ఎస్ రాజమౌలి, కొరటాల శివ, ప్రముఖ హాస్యనటుడు అలీ, ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ పోసాని కృష్ణమురళి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

శుభం కార్డు..

శుభం కార్డు..

టికెట్ల విషయంలో వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారంటూ చిరంజీవి స్పష్టం చేశారు. ఈ వివాదానికి శుభం కార్డు పడిందని తేల్చి చెప్పారు. సినిమా టికెట్ల రేట్ల నిర్ధారణ, రోజూ అయిదు ఆటల ప్రదర్శనకు అనుమతి, ఇతర అంశాలను పరిష్కరించడానికి ఉద్దేశించిన జీవో ఈ నెలాఖరులోగా విడుదల అవుతుందని ఆయన పేర్కొన్నారు. అటు ప్రేక్షకులు, ఇటు చలన చిత్ర పరిశ్రమకు నష్టం కలగని విధంగా ప్రభుత్వం తన తుది ముసాయిదా ప్రతులను సిద్ధం చేసిందని వివరించారు. చిరంజీవితో పాటు ఆర్ నారాయణమూర్తి, మహేష్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ.. వీరంతా ముఖ్యమంత్రితో జరిగిన చర్చలపై సానుకూలంగా స్పందించారు.

మంచు విష్ణు సంచలన ట్వీట్..

మంచు విష్ణు సంచలన ట్వీట్..

ఈ పరిణామాల మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు ఓ ట్వీట్ చేయడం.. ఆ తరువాత కొద్దిసేపటికే దాన్ని డిలేట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రివర్స్‌లో చేసిన ట్వీట్ అది. `మీరు దీన్ని సులభంగా చదవగలిగితే- బ్యాక్‌వర్డ్స్‌లో అద్భుతంగా చదవగలిగే శక్తి ఉన్నట్టే. పాయింట్ లెస్ టాలెంట్ మీలో ఉన్నట్టే.. ` అనేది ఈ ట్వీట్ సారంశం. కొద్దిసేపటికే ఆయన దాన్ని డిలేట్ చేశారు. చిరంజీవి అండ్ టీమ్ వైఎస్ జగన్‌ను కలిసిన వేళ.. ఈ ట్వీట్ చేయడం, దాన్ని డిలేట్ చేయడం చర్చనీయాంశమౌతోంది.

Recommended Video

Analysis On Tollywood Stars ,Ys Jagan Meet ఆచార్య లేకపోతె తెగేది కాదు| Oneindia Telugu
వైసీపీ సానుభూతిపరుడిగా..

వైసీపీ సానుభూతిపరుడిగా..

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులుగా మంచు కుటుంబానికి పేరుంది. వైఎస్ కుటుంబంతో మంచు కుటుంబానికి దగ్గరి బంధుత్వం కూడా ఉంది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు.. వైసీపీ గెలుపు కోసం ప్రచారం సైతం చేశారు. విశాఖపట్నం మొదలుకుని తమ సొంత జిల్లా చిత్తూరు వరకూ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత- మంచు కుటుంబం ఎలాంటి పదవులను కూడా ఆశించలేదు. మోహన్ బాబును రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం మొదట్లో సాగినా.. ఆ తరువాత అదీ తెరమరుగైంది

English summary
Maa President Manchu Vishnu tweets in reverse manner then deletes,What is his intention behind the tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X