మదనపల్లె జంట హత్యల కేసు: విశాఖ మెంటల్ ఆస్పత్రి నుండి పురుషోత్తం నాయుడు ,పద్మజ డిశ్చార్ , తిరిగి జైలుకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన కుమార్తెల జంట హత్యల కేసులో నిందితులైన పురుషోత్తం నాయుడు ,పద్మజ లను విశాఖపట్నం మానసిక వైద్యశాల నుండి డిశ్చార్జ్ చేసినట్లుగా తెలుస్తోంది. మదనపల్లె జంట హత్యల కేసులో మూఢ భక్తి తో ఇద్దరు కుమార్తెలను చంపుకున్న మదనపల్లె జంట హత్యల కేసులో భార్యాభర్తలిద్దరూ మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని వైద్యులు నిర్ధారించి, వారిని విశాఖ మెంటల్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే .
మదనపల్లె
జంట
హత్యల
కేసు
..
విశాఖ
మెంటల్
ఆస్పత్రికి
దంపతులు
పద్మజ
,
పురుషోత్తం
నాయుడు

మెంటల్ ఆస్పత్రి నుండి పురుషోత్తం నాయుడు ,పద్మజ డిశ్చార్జ్ ,
మదనపల్లె సబ్ జైలు లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పురుషోత్తం నాయుడు , పద్మజ మానసిక ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వైద్యులు చేసిన సూచన మేరకు గత నెల 4వ తేదీ నుంచి చిన్న వాల్తేరు లో గల ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం మీరు మానసిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేస్తునట్లుగా వైద్యులు ప్రకటించారు . దీంతో వారిని అధికారులు తిరిగి మదనపల్లె సబ్ జైలుకు తరలించనున్నారు.

మూఢ భక్తితో కుమార్తెలను హతమార్చిన కేసు.. దేశవ్యాప్తంగా షాక్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లెలో మూఢ భక్తితో కుమార్తెలను హతమార్చిన కేసులో యావత్ తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ వ్యాప్తంగా షాకింగ్ గా నిలిచింది. సాయి దివ్య, అలేఖ్య కన్న బిడ్డలను జనవరి 24 న హత్య మార్చి వారు తిరిగి బ్రతికి వస్తారని తల్లిదండ్రులు వింతగా ప్రవర్తించడం, హింసాత్మక ఘటనలకు పాల్పడడం, జుగుప్సాకరమైన పనులను చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తల్లిదండ్రులు చేసిన ఘాతుకాన్ని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసిన అనంతరం కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు వారికి 15 రోజుల రిమాండ్ విధించటంతో వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.

కుమార్తెలను చంపి .. మానసిక వ్యాధి గ్రస్తులుగా భార్యాభర్తలు పద్మజ, పురుషోత్తం నాయుడు
ఇక జైల్లోనూ వారు రాత్రి సమయాల్లో చిత్రవిచిత్రంగా కేకలు వేయడం,పద్మజ తానే శివుడు అంటూ అరవడం వంటి ఘటనలకు పాల్పడటంతో వారిని వైద్యపరీక్షల నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు అడిగిన ప్రశ్నలకు కూడా చిత్ర, విచిత్రమైన సమాధానాలు చెప్పిన భార్యాభర్తలు ఇరువురూ మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని, వారిరువురిని జైలు వంటి గదిలో ఉంచి చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తిరిగి మదనపల్లె జైలుకు దంపతుల తరలింపు
అందరితో
కలిసి
ఉంచితే
ప్రమాదమని,
విశాఖపట్నంలోని
మానసిక
చికిత్స
ఆలయానికి
రిఫర్
చేస్తున్నామని
రుయా
ఆసుపత్రి
వైద్యులు
పేర్కొన్నారు.
దీంతో
వారిని
విశాఖ
మానసిక
వైద్య
శాలకు
తరలించి
చికిత్స
అందించారు
.
ప్రస్తుతం
వారి
మానసిక
స్థితి
నిలకడగా
ఉండటంతో
డిశ్చార్జ్
చేస్తున్నారు.
ఇక
వారిని
తిరిగి
మదనపల్లె
సబ్
జైలుకు
తరలించనున్నారు
.